బిగ్ బాస్ తో సీజన్ 1 తో పరిచయం అయిన కత్తి మహేష్ తర్వాత పవన్ కళ్యాన్ తో గొడవ..శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వివాదంలో రగడ ఇలా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. ఇది కాదని ఓ అడుగు ముందుకు వేసి హిందువులు ఎంతో గౌరవంగా పూజించే శ్రీరాముడు, సీతమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేసులు నమోదు కావడంతో ఆయనను ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి వీళ్లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి కత్తి మహేష్ సిద్ధపడుతున్నారు. ఈ మేరకు న్యాయవాదిని కూడా నియమించుకుని తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, శ్రీరాముడి శ్లోకాలతో కూడిన భజన పాటను కత్తి మహేష్ ఆలపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రాముడి పాటను చాలా స్పష్టంగా మహేష్ పాడుతున్న వీడియోను ఓ యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. కేవలం 59 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మహేష్ నోట రాముని పాట తప్ప ఇంకేమీ లేదు. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు..భయంతో పాడుతున్నాడా..భక్తితో పాడుతున్నాడా అని అంటున్నారు.