సౌత్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన సమంత తర్వాత అగ్రహీరోలతో నటించి మంచి పొజీషన్లోకి వచ్చింది. గత యేడాది అక్కినేని నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సమంత తర్వాత సినిమాల్లో నటించబోదని అందరూ అనుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో సమంత మాత్రం తనకు పెళ్లైనా సినిమాలు మాత్రం చేస్తానని..తనకు బోర్ వచ్చే వరకు సినిమాల్లో నటిస్తానని అన్నారు. అయితే వివాహం అనంతరం సమంత రాజుగారి గది2, రంగస్థలం, అభిమన్యుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో రంగస్థలం, అభిమన్యుడు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దాంతో సమంతకు అప్పటికన్నా ఇప్పుడే డిమాండ్ బాగా పెరిగిపోయింది.
ప్రస్తుతం యూటర్న్ సినిమాలో నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో సమంత సినిమాలకి గుడ్ బై చెప్పనుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలని సామ్ భావిస్తుందట. ఒకవేల చైతూ, సమంత లకు పిల్లలు పుడితే కెరీర్ కి ఇబ్బందులు కలుగుతాయని ఈ నిర్ణయం తీసుకుందా.. అప్పట్లో తాము పిల్లల్ని గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు అని చెప్పింది .
పిల్లల్ని కనేందుకు ఓ టైమ్ అనుకున్నాం. ఆ సమయం వచ్చేదాకా కెరీర్ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నాం అని సామ్ తెలిపింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.