నాని ఇప్పటివరకు స్పీడ్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే కృష్ణార్జున యుద్ధం సినిమా తరువాత నాని జోరు తగ్గిందని చెప్పాలి. అయితే తరువాత తీయబోయే సినిమాలు నానికి చాలా ముఖ్యం అని చెప్పాలి. ఈ సినిమా లన్ని కొంచెం శారీరిక శ్రమతో కూడిన సినిమాలు అని చెప్పాలి. అందుకే నాని కసరత్తులు ప్రారంభించాడు.  కృష్ణార్జున యుద్ధం  సినిమా తరువాత నాని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడని చెప్పాలి.
తన కెరీర్ ను పునఃసమీక్షించుకునే క్రమంలో మరోసారి విలక్షణ కథలకు ఓటేస్తున్న నాని, అందులో భాగంగా ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు ఇలా వచ్చి అలా చేసేవికాదు. ఎంతో శ్రమతో కూడుకున్నవి. గౌతమ్ తిన్ననూరి సినిమాలో లేటు వయసులో క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న పాత్ర చేయబోతున్నాడు నాని.
ఈ క్యారెక్టర్ కోసం నెలరోజుల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయబోతున్నాడు. ఇక హను రాఘవపూడి సినిమా అయితే ఏకంగా మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఈ మూవీ కోసం మరింత శ్రమపడాలి. ఇలా ఈ రెండు సినిమాల కోసం శారీరకంగా కూడా కష్టపడబోతున్నాడు నాని. ప్రస్తుతం నాగార్జునతో కలిసి దేవదాస్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే జెర్సీ మొదలవుతుంది. 
 
Top