బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రాకు అభిమానులు తెగ పెరిగిపోతున్నారు. హృతిక్ రోషన్ నటించిన క్రిష్, క్రిష్ 2 లో ప్రియాంక చోప్రా కు మంచి పేరు వచ్చింది. వాస్తవానికి ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించింది తక్కువే అయినా హీలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్ తెచ్చుకున్న తర్వాత అభిమానులు తెగ పెరిగిపోతున్నారు. ఐశ్వర్యరాయ్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్నది ఆమే. ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్‌కు చేరింది.
ఈ సందర్భంగా అభిమానులకు ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. ‘25 మిలియన్ స్ట్రాంగ్. ధన్యవాదాలు. మీరు నన్నెంతగా అభిమానిస్తున్నారో మిమ్మల్ని నేను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 13.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్‌కు 9.5 మిలియన్, షారుక్ ఖాన్‌కు 13.3 మిలియన్, సల్మాన్ ఖాన్‌కు 17.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ప్రియాంక మెచ్చిన ప్రియుడు, ప్రియాంక (35) కంటే వయసులో పదేళ్లు చిన్న వాడైన నిక్ జోనాస్ (25)కు ఫాలోవర్లు 1.55 కోట్ల మంది ఉన్నారు.
అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘క్వాంటికో’తో ప్రియాంక హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సిరీస్‌తో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘బేవాచ్’ చిత్రంలో నటించారు. ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్ చిత్రమిది. ప్రస్తుతం ఆమె ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘ఇజింట్ ఇట్ రొమాంటిక్’చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌కు జోడీగా ‘భారత్’ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా కోసం ప్రియాంక రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.