బిగ్ బాస్ తో ఫేమస్ అయిన కత్తి మహేష్ తర్వాత పవన్ కళ్యాన్ పై చేసిన వ్యాఖ్యలతో ఆ మద్య సోషల్ మీడియాలో ప్రతిరోజు సెస్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చాడు.  ఆ మద్య ఓ వివాదంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఆయన జనసేన కార్యకర్తలో ఫోటో దిగి వివాదం ముగిసేలా చేశారు. కానీ తర్వాత కూడా ఆయన పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు.  ఇదిలా ఉండగా ఈ మద్య కత్తి మహేష్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద వివాదం అయ్యింది.  దీనిపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేషన్ ని ఉతికి ఆరేశాడు.
తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కత్తి మహేష్..  మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కత్తి మహేశ్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ మేరకు ఓ వీడియోను పోస్టు చేసిన కత్తి, నాగబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. తన పేరు చెప్పకుండా, తనను నీచుడిగా సంబోధించిన వీడియోను తాను చూశానని, దాన్ని చూసిన తరువాత తనకు జాలి కలిగిందని అన్నాడు.మీ కుటుంబం ఏమైనా రామ భక్తులా? అని ప్రశ్నించిన కత్తి, ప్రజలను మోసం చేస్తూ, ఉన్న పార్టీలను అమ్ముకుని వేరే పార్టీలో చేరడం, 'జబర్దస్త్'లో కూర్చుని పిచ్చి నవ్వులు నవ్వడమే సమాజానికి మీరు చేస్తున్న సేవని నిప్పులు చెరిగాడు.
మీ కుటుంబం, మీ సోదరుల గురించి తాను మాట్లాడితే తట్టుకోవడం కష్టమని హెచ్చరిస్తూ, తాను చావడానికి సిద్ధమని, అయితే తనపై ఏదైనా చెయ్యి పడితే దానికి బాధ్యత మీదేనని అన్నాడు.  ఓ దళితుడిని నీచుడని సంబోధించారంటే, ఎంతో అహకారం ఉండి వుండాలని, సెక్యులర్ హిందువు ఎక్కడి నుంచి వచ్చారని కత్తి ప్రశ్నించాడు. దళితులపై, ముస్లింలపై దాడులు జరిగినప్పుడు ఏం చేస్తున్నారని దుయ్యబట్టాడు.
 
Top