కేర‌ళ‌లో ఫేమ‌స్ టీవి స్టా‌ర్ సూర్యా శ‌శికుమార్ దొంగ‌నోట్ల‌తో పట్టు‌బ‌డింది. పోలీసుల విచార‌ణ‌లో ఆమె నుంచి ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగుచూశాయి. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో సంబంధాలున్న‌ట్టు‌...బీజూ అనే ఓ దొంగ‌స్వా‌మి ద్వా‌రా న‌కిలీ క‌రెన్సీ నోట్ల ముఠాతో ఆమెకు ప‌రిచ‌యాలు ఏర్ప‌డిన‌ట్టు పోలీసులు తేల్చా‌రు.
ఒక్క కేరళలోనే ఆమె దొంగ నోట్లు పరిమితం కాలేదని, తమిళనాడులోనూ వాటిని చెలామణిలోకి తేవడానికి ఏజంట్లతో ఒప్పందం కుదుర్చుకుందని విచారణలో గుర్తించిన పోలీసులు, తమ దర్యాఫ్తును పక్క రాష్ట్రానికి విస్తరించాలని నిర్ణయించారు. కాగా, కొద్ది రోజుల క్రితం రూ. 2.50 లక్షల నకిలీ కరెన్సీతో తమకు పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను విచారించిన పోలీసులు ఆపై సూర్యా శశికుమార్ ఇంట్లో తనిఖీ చేయగా, రూ. 57 లక్షల విలువైన నకిలీ నోట్లు లభ్యమైన సంగతి తెలిసిందే.  
సెలబ్రెటీ ముసుగులో ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న టివి నటి సూర్య శివకుమార్ వ్యవహారంతో మాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారే ఉలిక్కి పడింది..ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారాలు జరగడం పై కన్నెర్రజేస్తుంది.  ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె తల్లి రమాదేవి, సోదరి శృతిలను పోలీసులు విచారిస్తున్నారు.
 
Top