'ఎన్టీఆర్' బయో పిక్ లో బాలకృష్ణ నటిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే దీనికి క్రిష్ రంగంలోకి దిగి చక చక బండి ని నడిపిస్తున్నాడు. దీనితో ఈ సినిమా ఎట్టకేలకు ముందుకు సాగిపోతుందండటం లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లో ఉన్నప్ప్పుడు స్టిల్ ను వదిలారు. అయితే ఆ ఫోటో లో బాలకృష్ణ ఏమాత్రం కరెక్ట్ గా సరిపోలేదని అందరూ పెదవి విరుస్తున్నారు.

బాలయ్య బాలకృష్ణ మాదిరిగానే ఉన్నాడని, రామారావు లాగా లేడని అందరూ చెబుతున్నారు. మహానటిగా కీర్తి సురేష్ అలా అచ్చు దిగిపోయినట్లు అందరూ సెట్ కావడం కష్టం కదా? అందుకే ఎన్టీఆర్ బయోపిక్ బిగిన్స్ అంటూ తలపాగా చుట్టుకుని, ఖాకీ చొక్కా తొడుకున్న ఎన్టీఆర్ స్టిల్ ను చూస్తుంటే, అచ్చం బాలయ్యను చూసినట్లే వుంది. యంగ్ ఏజ్ లో అంటే సిన్మాల్లోకి వచ్చిన కొత్తలో జననీ జన్మభూమి లాంటి సినిమాలు చేసిన టైమ్ లో బాలయ్య ఎలా వుంటారో? అలాగే వుందీ లుక్.


ఫొటో కాబట్టి పాత పిక్స్ అన్నీ ముందేసుకుని ఏదో ఒకటి చేసారు. ఫోటో సంగతి పక్కన పెడితే అందమైన ఎన్టీఆర్ చేతి రాత ఆకట్టుకుంటుంది. ఆయన సంతకం, ఆయన రాసిన వాక్యాలు, ఒక్కసారిగా ఆయన జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. ఇవన్నీ ఇలా వుంచితే మొత్తం మీద ఎన్టీఆర్ బయోపిక్  అన్ని బాలా రిష్టాలను దాటుకుని, అడుగు ముందుకు వేసింది. క్రిష్ ఎలాగూ బండిని చకచకా నడిపిస్తారు కాబట్టి, మును ముందు ఇంకా మంచి మంచి లుక్ లు ఎన్నో వచ్చే అవకాశం అయితే వుంది.
 
Top