టాలీవుడ్ లో లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇలా అన్ని అంశాలను కలుపుతూ సినిమాలు తీయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దిట్ట.  ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమాలు దాదాపు అన్ని హిట్ గానే నిలిచాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.  ఈ సినిమా పూర్తయిన తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట మాటల మాంత్రికుడు.

అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆ కథను తెరపై ఆవిష్కరిస్తూ ఉంటాడు. అలాంటి త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో వుండనుందని తెలుస్తోంది.  త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.  'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' చేసిన అల్లు అర్జున్, మళ్లీ ఆయనతో చేయడానికి కొంతకాలంగా ఉత్సాహాన్ని చూపుతున్నాడు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఆయనకి ఒక కథ చెప్పడం .. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో   'అరవింద సమేత ..' చేస్తోన్న త్రివిక్రమ్ తర్వాత సినిమా అల్లు అర్జున్ తో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.  ఇక అల్లు అర్జున్ కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడట.
 
Top