ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడలేదేమో అనిపిస్తోంది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈ సినిమా సక్సస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో విజయ్ ఇప్పటికే మితిమీరిన ఉత్సాహంతో అతి చేస్తున్నాడు అంటూ ఘాటైన విమర్శలు వస్తున్నాయి.   

దీనికితోడు ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన నెల రోజుల గడిచిపోయిన తర్వాత కూడా విజయ్ దేవరకొండ  బయట కూడ ‘అర్జున్ రెడ్డి’ లా ఫీల్ అవుతూ అదే యాటిట్యూడ్ చూపిస్తూ  అందరికీ షాక్ ఇస్తున్నాడు. దీనికి కొనసాగింపుగా ఈ మధ్య విజయ్ ఒక ప్రముఖ వస్త్రవ్యాపార సంస్థకు బ్రాండ్‌ కు అంబాసిడర్‌ ఎంపిక అయ్యాడు. అయితే ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మాయిలతో విజయ్ దేవరకొండ చేసిన చిట్ చాట్ అనేక విమర్శలకు తావు ఇస్తోంది. 

దీనికితోడు ఆ వస్త్ర వ్యాపార సంస్థకు సంబంధించిన  షోరూం ఓపెనింగ్‌ కు విజయ్ దేవర కొండ వచ్చాడు.  ఈ కార్యక్రమానికి హీరోయిన్ కేథరిన్ కూడ వచ్చింది. ఆశ్చర్యకరంగా ఆ వేడుకలో విజయ్ కేథరిన్‌ తో కలిసి ఓపెన్ గా రొమాన్స్ చేస్తూ ఆమెను పట్టుకుని రకరకాల యాంగిల్స్‌లో మీడియా కెమెరాలకు పోజు ఇవ్వడం షాకింగ్ గా మారింది. 

ఇది చాలదు అన్నట్లుగా ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది అమ్మాయిలతో విజయ్ చనువుగా ప్రవర్తించడం మీడియా వర్గాల దృష్టిని ఆకర్షించింది. దీనితో ఇలా షోరూం ఓపెనింగ్స్‌ లో ఓ హీరో రెచ్చిపోవడం ఇంతకుముందెన్నడూ చూడలేదు అంటూ మీడియా వర్గాలు కూడ తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి.  

అయితే తన గురించి ఎవరేమనుకున్నా పట్టనట్లుగా తనకేమనిపిస్తే అది చేస్తూ ఏమనిపిస్తే అది మాట్లాడుతూ సాగిపోతున్నడు విజయ్ తమన పద్ధతిని కొనసాగిస్తూ  యూత్‌ లో తనకు మంచి ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోతున్న విధానానికి చాలామంది ఆశ్చర్య పోతున్నట్లు టాక్. ఇదే విధానం విజయ్ భవిష్యత్ లో కూడ కొనసాగిస్తే అతడికి కెరియర్ పరంగా సమస్యలు వచ్చే అవకాసం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..
 
Top