జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ మన తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల ప్రవాహం కురిపిస్తూ ఉన్నా ఈమూవీ పవన్ సినిమాలలో ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కలక్షన్స్ ను అధికమించలేకపోవడం కొంత షాకింగ్ న్యూస్ గా మారింది. మహేష్ పవన్ ల సినిమాల క్రేజ్ తో పోల్చుకుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా క్రేజ్ ఉండదు.
అందువల్లనే ఈసినిమాను భారీ మొత్తానికి కొనుక్కున్న బయ్యర్లు ఈ చిత్రానికి సంబంధించి ఒకటిక్కేట్ కొంటే మరొక టిక్కెట్ ఉచితం అనే స్కీమ్ పెట్టినా ఈసినిమా మొదటిరోజు ఓవర్సీస్ కలక్షన్స్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను దాటాలేకపోయింది అని తెలుస్తోంది. ఈమూవీ తొలిరోజు వసూళ్లు ప్రీమియర్లు పరిగణనలోకి తీసుకొంటే ప్రస్తుతం ‘జై లవ కుశ’ ఐదో స్థానంలో నిలిచింది.
అయితే ఈసినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు నుండి ఈసినిమాకు ఓవర్సీస్ లో కలక్షన్స్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి అందుతున్న లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈమూవీ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా కలక్షన్స్ పెంచుకుని 100 కోట్ల సినిమాగా మారే ఆస్కారం ఉంది అంటున్నారు.
దీనికి తొలి మెట్టుగా ఒక మిలియన్ డాలర్ కలక్షన్స్ మార్క్ ను ‘జై లవ కుశ’ నిన్నటితో అధిగమించింది అని అంటున్నారు. ‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో వరుసగా నాలుగో హిట్ గా ‘జై లవ కుశ’ మారింది.
అయితే ఈమూవీని భారీ మొత్తాలకు కొనుక్కున్న నేపధ్యంలో ఈ కలక్షన్స్ ఇదే విధంగా నిలబడితే కాని ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు గట్టెక్కడం కష్టమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఓవర్సీ లో శని, ఆదివారాల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను సాధిస్తే రెండు మిలియన్ డాలర్లను అధిగమించడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..