దసరా  సీజన్  ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘జై లవ కుశ’  ఏమేరకు రికార్డులను బ్రేక్ చేస్తుందో అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఈసినిమా కళ్యాణ్ రామ్ కష్టాలను తీర్చిన కల్పతరువుగా మారింది అన్న విషయం మాత్రం వాస్తవం. నిర్మాతగా నటుడిగా గత 10 ఏళ్ళుగా ఎన్నో పరాజయాలను చూసిన కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లాంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై  నిర్మించిన ఈమూవీ చేసిన బిజినెస్ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఒక దశలో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈసినిమాను చాలతక్కువ బడ్జెట్ లో తీసారని వార్తలు రావడంతోపాటు ఏకంగా ఈ సినిమా వల్ల 60కోట్ల వరకు లాభాలు కళ్యాణ్ రామ్ కి వచ్చాయి అని వార్తలు రావడం చూస్తే ‘జై లవ కుశ’ మ్యానియా ఇండస్ట్రీని ఏవిదంగా షేక్ చేస్తోందో అర్ధం అవుతుంది.   ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ రెమ్యూనిరేషన్ తో పాటు అన్నీ తీసివేయగా   ఈమూవీ వాళ్ళ కళ్యాణ్ రామ్ కు 36కోట్లు లాభం వచ్చినట్లు తెలుస్తోంది. 

దాదాపు 120 వర్కింగ్ డేస్ షూట్ ఈసినిమాకు చేయవలసి రావడంతో పాటు ఈమూవీలో జూనియర్   మూడు క్యారెక్టర్లు చేయడంతో సెకెన్ల లెక్కన గ్రాఫిక్స్ పై  బాగానే ఖర్చయిందని తెలుస్తోంది. ఇక  ‘జై లవ కుశ’ పబ్లిసిటీ విషయంలో కళ్యాణ్ రామ్ అనుసరిస్తున్న వ్యూహాలు మరింత షాకింగ్ గా మారాయి. కేవలం ఎఫ్ ఎమ్ రేడియో పబ్లిసిటీకే కళ్యాణ్ రామ్ 20 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు ప్రింట్ విజువల్ మీడియా అన్నింటికీ కలిపి కోట్లలో కళ్యాణ్ రామ్ ఖర్చు చేస్తున్న నేపధ్యంలో ఈమూవీకి రాబోతున్న ఓపెనింగ్స్ ఎవరి అంచనాలకు అందని విషయంగా మారింది.  దీనితో కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ పెట్టిన నాటినుంచి ఇవ్వాల్టి  వరకు పోగొట్టుకున్న నష్టాలను తీర్చే కామధేనువుగా ‘జై లవ కుశ’ మారింది. ఒక్క మాటలలో చెప్పాలి అంటే పబ్లిసిటీ పరంగా ‘జై లవ కుశ’ స్పీడ్  ‘స్పైడర్’ కన్నా బాగా ముందు వరసలో పరుగులు పెడుతోంది  అన్నది వాస్తవం.. 
 
Top