మరొక 10 రోజులలో విడుదల కాబోతున్న ‘స్పైడర్’ పై మహేష్ అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నట్లుగానే ఈసినిమా పై నెగిటివ్ ప్రచారం కూడ చాల భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించి మరింత క్రేజ్ ను పెంచడానికి ఈమూవీ స్టిల్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఈమూవీ పై అంచనాలు పెంచడానికి ఈసినిమా యూనిట్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మహేష్ రకుల్ ప్రీత్ స్టిల్స్ ను విడుదల చేసిన ఈసినిమా యూనిట్ వర్గాలు మొట్టమొదటిసారిగా మహేష్ విలన్ పాత్రధారి ఎస్.జె. సూర్యాలు కలిసి ఉన్న ఒక లేటెస్ట్ స్టిల్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే మురుగదాస్ స్టైల్ సన్నివేశం అనిపిస్తోంది.
సామాన్యంగా మురగదాస్ సినిమాలలో హీరో విలన్ ఎదురెదురుగా వచ్చే సన్నివేశాలు ఎక్కువగా క్లైమాక్స్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ స్టిల్ ను చూస్తూ ఉంటే ‘స్పైడర్’ లో కూడా ఇదే టెంప్లేట్ ఫాలో అయినట్లుగా అనిపిస్తోంది. ఈసీన్ లో హీరో మహేష్ బాబు విలన్ ఎస్ జే సూర్యలు పోటీపడి యాక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
జైల్ లో ఇంటరాగేషన్ సీన్ గా దీనిని చిత్రీకరించినట్లు అంటున్నారు. ఇక్కడ స్పై పాత్ర పోషిస్తున్న మహేష్ సీరియస్ లుక్స్ తో ఉంటే విలన్ సూర్య మాత్రం తన నవ్వుతోనే మహేష్ ను తెగ విసిగించేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఉగ్రదాడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించాలనే ఉద్దేశ్యంతో ఈసన్నివేశం ఈ సినిమాలో క్రియేట్ చేసారని తెలుస్తోంది.
అయితే ఈ సీన్ ను ఇఫ్పటికే హాలీవుడ్ మూవీలో బ్యాట్ మ్యాన్ వర్సెస్ జోకర్ లో వచ్చే సీన్ మాదిరిగా ఉందంటూ నెటిజన్లు ఈ స్టిల్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉంటుంది అని మురగదాస్ లీకులు ఇస్తున్న నేపధ్యంలో ఈమూవీ స్టిల్ పై వస్తున్న సెటైర్లు మహేష్ అభిమానులను ఖంగారు పెడుతున్నట్లు టాక్..