వరుస ప్లాపులతో ఉన్న కమెడియన్ సునీల్ దశ ఉంగరాల రాంబాబు సినిమాతో అయినా మారుతుంది అనుకుంటే ఉన్నది కాస్త తిరగబడింది. సినిమాను రియాలిటీకి దూరంగా, పాత కమర్షియల్ కథలను మళ్లీ రుద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్రాంతి మాధవ్. ఇక సినిమాలో కొన్ని సిత్రాలను చూసి దేవుడా అని ప్రేక్షకులు తలలు పట్టుకోక తప్పదు. అలాంటి వాటిల్లో కొన్ని సిత్రాలను మచ్చుకు చూద్దాం. సినిమాలో లెక్కలేనన్ని లోపాలు ఉండడంతో అన్ని చెప్పలేం కనుక కొన్ని సిత్రాలు ఇలా ఉన్నాయి.
- ఆశిష్ విద్యార్థి, రాజీవ్ కనకాల పాత్రలు ఎందుకు వస్తాయో, ఎందుకు పోతాయో కూడా తెలియనంత కథ ఉంది.
- కమ్యూనిస్టులు ఉన్న గ్రామం కావాలంటే అసలు కేరళకే ఎందుకు వెళ్లారో అర్థం కాదు. మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఉండరా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
- కేరళలో ఒక్కరు కూడా మళయాళంలో మాట్లాడరు. అందరూ తెలుగులోనే మాట్లాడుతూ కనపడ్డారు.
- ఈ సినిమా చూస్తే ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు వంటి సెన్సిబుల్స్ ఉన్న సినిమాలు తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాను తీశాడా అనిపిస్తుంది.
- కామెడీ సన్నివేశాలు పాత సినిమాల్లోనుంచి ఎత్తేసినవే ఉంటాయి.
- హీరో ఇంట్రడక్షన్ సన్నివేశంలో హీరో చిరంజీవిని ఇమిటేట్ చేయడం చూసి బాబోయ్ అనిపిస్తుంది.
- జిబ్రాన్ సంగీతం థియేటర్ నుంచి బయటకు రాకుండానే మర్చిపోతాం.
- ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలు తీసిన క్రాంతి మాధవేనా ఈ సినిమా తీసింది అన్న సందేహంతో సినిమా అయ్యాక ప్రేక్షకుడికి గింగరాలు తిరగక తప్పదు.ఇక వరుస ప్లాపుల్లో ఉన్న సునీల్ కూడా పై రెండు సినిమాలు చూసే ఈ దర్శకుడికి కమిట్ అయ్యి ఉండొచ్చు.
- సునీల్ బెటర్ లక్ నెక్ట్స్ టైం.