తన సినిమాల ప్రమోషన్ గురించి కూడ పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ ను ప్రమోట్ చేస్తున్నాడు అని గాసిప్పులు రావడం ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో అత్యంత ఆశ్చర్యకర విషయంగా మారింది. పంజాబీ బ్యూటీ అయిన పూనమ్ చాల తెలుగు సినిమాలలో నటించినా ఆమెకు పెద్దగా క్రేజ్ ఏర్పడలేదు.

దీనితో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ అవకాశాలు కూడ లేవు. దీనికితోడు ప్రస్తుత తరం యూత్ ఈమెను ఎప్పుడో మరిచిపోయారు. అటువంటి ఇమేజ్ లేని హీరోయిన్ ను ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు అనే వార్తలు రావడం ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈమెకు ఈ స్థాయిలో గౌరవం దక్కడం వెనుక గాడ్ ఫాదర్ ఎవరు ? అన్న విషయమై రకరకాల చర్చలు కూడ జరుగుతున్నాయి.

ఈ చర్చల నేపధ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం పూనమ్ కు పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో పరిచయం సాన్నిహిత్యం ఉంది అని అంటున్నారు. అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరితోనూ పెద్దగా సాన్నిహిత్యం పెంచుకొని పవన్ ను పూనమ్ ఎలా బుట్టలో పడేసింది అన్న విషయం పై ఎవరికీ అర్ధంకాని సందేహాలు ఎన్నో వస్తున్నాయి.

అయితే పవన్ నిజంగానే ఈమె పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రికమండ్ చేసాడా ? లేదంటే ఈమె రికమండేషన్ వెనుక మరెవరైనా ప్రముఖ వ్యక్తి ఉన్నారా ? అనే సందేహాలు కూడ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత లాంటి టాప్ హీరోయిన్ వ్యవహరిస్తూ ఉంటే ఏమాత్రం ఇమేజ్ లేని పూనమ్ వల్ల ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి ఏవిధంగా ప్రయోజనం కలుగుతుంది అన్న విషయమై సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి..  
 
Top