మరికొద్దిరోజుల్లో అక్కినేని కుర్రాడితో పెళ్లి పీటలెక్కాల్సిన అమ్మడు మళ్లీ ఇవాళ మరో హాట్ ఫోటో షూట్ తో ప్రేక్షకుల కంట పడింది. తీరా ఏంటి అని చూస్తే అమ్మడు ఇదవరకు కన్నా మరింత హాట్ గా ఆ ఫోటోషూట్ లో దర్శనమిస్తూ ఉండటం అక్కినేని ఫ్యాన్స్ కు నిద్ర పట్టకుండా పోతుంది. సమంతతో పెళ్లికి సిద్ధమైన నాగ చైతన్య ఓ పక్క తన పెళ్లి ముచ్చట్లు షేర్ చేసుకుంటుంటే మరో పక్క సమంత ఇలా రెచ్చిపోతుంది.
కెరియర్ సంక్షోభంలోనో లేక ఆఫర్లు రాకనో చేయాల్సిన ఫోటో షూట్స్ అమ్మడు మంచి స్వింగ్ లో ఉన్నా చేస్తుంది అంటే తను ఇంకా సినిమాల్లో కొనసాగుతానే అర్ధమని తెలుస్తుంది. ఇక ప్రేమ పెళ్లి మాటలపై మొదటిసారి స్పందించిన చైతు సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది అన్నట్టు చెప్పాడు. ఇదో రకంగా అభ్యంతరం తెలపాల్సిన విషయమే కాని చేసే సినిమాలు కూడా సెలక్టివ్గా ఉంటాయట.
కోలీవుడ్ రెండు సినిమాలను ముందు ఒప్పుకుని తర్వాత కాదనేసిన సమంత పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది ఆనుకున్నారు కాని రీసెంట్ గా సౌత్ స్కోప్ కు ఇచ్చిన ఫోటో షూట్ కొద్ది గంటల నుండి సందడి చేస్తున్నాయి. మరి సమంత హాట్ లుక్స్ చూస్తుంటే ఇప్పుడప్పుడే హీరోయిన్ గ రిటైర్మెంట్ ప్రకటించేది లేదు అన్నట్టు ఉంది.
అదే విషయాన్ని చైతు కూడా కన్ఫాం చేయడంతో సమంత పెళ్లి తర్వాత కూడా ఎప్పటిలానే సినిమాలు చేస్తుంది అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. మొత్తానికి చైతు సమంతల లవ్ అటు వారి ప్రొఫెషనల్ లైఫ్ కు ఎటువంటి భంగం కలుగకుండా చేసుకుంటున్నారన్నమాట.