మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు కొణెదెల ప్రొడక్షన్ అధినేత రాం చరణ్. దుమ్మురేపే ట్రైలర్ తో సంక్రాంతి హిట్ తనదే అంటూ శాసించడానికి వస్తున్నట్టు కనిపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తమిళ కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత సోలోగా నటిస్తున్న సినిమాగా వస్తుంది.
ఎంతోమంది అతిధుల మధ్యలో ఖైది సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంది. మెగా ఫ్యామిలీ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక చిరు 9 ఏళ్ల తర్వాత సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా వినాయక్ ఈ సినిమా తెరకెక్కించారు. మురుగదాస్ కథకు తన మార్క్ మార్పులతో డైరక్టర్ గా వినాయక్ తన సత్తా చూపనున్నారు.
సినిమా మ్యూజిక్ అందించిన దేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదిరిపోయే మ్యూజిక్ తో ఆల్బం అంతా అదరగొట్టాడు దేవి. సంక్రాంతి బరిలో పోటాపోటీగా వస్తున్న ఖైది సినిమా నుండి రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచేసింది. పొగరు నా ఒంట్లో ఉంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంది అని చెప్పిన మెగాస్టార్ డైలాగ్ ఒక్కటి చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకునేందుకు. మరి సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే జనవరి 11 దాకా ఆగాల్సిందే.