మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150′ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైలాండ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్లో కొన్ని ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ సినిమా అనే కామెంట్ చేసాడు స్టైలిష్ స్టార్. ఈ ఫంక్షన్ లో సినిమా గురించి మాట్లాడిన బన్నీ ” దాదాపు పదేళ్లు గ్యాప్ వచ్చినా మేం మిమల్ని మర్చిపోలేదు. ఈ కొన్నేళ్లు మీ మీద అభిమానం చూపించే అవకాశం రాలేదు.. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది అన్నయ్య అంటూ ఇక్కడికి కదిలి వచ్చిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు’ తెలియజేస్తున్నా. ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి ఎన్నో చెప్పలేని విషయాలు, బాధలు, ఫీలింగ్స్ గురించి అవమానాల గురించి వాటన్నిటికీ ఈ సినిమా ఓ సమాధానం. ఈ సినిమాయే కాదు ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతీ సమాధానం. ఎత్తిన ప్రతీ వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతీ నోరు మూసుకోవాలి ” అంటూ మెగా స్టార్ పై తన ప్రేమను మరోసారి వ్యక్తపరిచాడు అల్లు అర్జున్.

 
Top