మెగా స్టార్ రి ఎంట్రీ ఇస్తున్న ప్రతిష్టాత్మక 150 వ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఫంక్షన్ లో ఒక్క సారి గా చిరు పై కామెంట్స్ చేసిన వారి పై విరుచుకు పడ్డాడు నాగ బాబు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ” చాలా మంది అన్నయ్య రీమేక్ చేయడమేంటి? స్టైట్ సినిమా చెయ్యొచ్చు కదా అని రక రకాలుగా మాట్లాడారు.. రీమేక్ చేయడం లో తప్పేంటో నాకు అర్ధం కాలా.. ఎన్నో తెలుగు సినిమాలు చిరంజీవి గారు రజిని కాంత్ గారు చేసిన సినిమాలు రీమేక్స్ అయ్యాయి. ప్రతీ వాడికి మెగా ఫ్యామిలీ మీదో మెగా స్టార్ మీదే చూపు ఉంటుంది. అలా విమర్శిస్తే వాళ్ళకి ఓ మైలేజ్ వస్తుంది. మేము ఇలాంటి విమర్శలేం పట్టించుకోము. ఇక ఈ మధ్య హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి బొంబాయి వెళ్లిపోయి రక రకాల కూతలు కూస్తున్నాడొకడు. వాడికి కూయడం తప్ప పని రావట్లే. వాడు కూతలు మానేసి దర్శకత్వం చేసుకుంటే వాడికి మంచిది మాకు మంచిది. ఇలాంటి అక్కు పక్షి, పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు..ముందు నువ్వు సినిమా చెయ్యడం నేర్చుకో ఒకప్పుడు బాగా తీసే వాడివి ఇప్పుడు పడిపోయింది నీ స్టాండర్డ్. మళ్ళీ నువ్వు మంచి సినిమాలు చేసుకో. నువ్వు పేల్చాల్సిన బాంబ్ ఏదో బొంబాయి లో పేల్చు.. అంటూ ఘాటు గా స్పందించాడు మెగా బ్రదర్.. ఇలా ఆవేశంగా మాట్లాడుతూ మెగా ఈవెంట్ లో హైలైట్ గా నిలిచాడు నాగబాబు..

 
Top