మెగా స్టార్ రి ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150 ‘ ట్రైలర్ రిలీజ్ అయింది. మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ సినిమా ప్రెజెంట్ సోషల్ మీడియా లో హంగామా చేస్తుంది. మరి మోస్ట్ ఎవైటింగ్ మెగా ట్రైలర్ ఎట్రాక్ట్ చేసిందో? ఓ లుక్ వేద్దాం.

దేవి అందించిన అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆ తరువాత మెగా స్టార్ మాస్ లుక్, స్టైల్, డైలాగ్ తో విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆరు పదుల వయసులోనూ సరి కొత్త స్టైల్ లో అదుర్స్ అనిపిస్తూ ట్రైలర్ తో మెస్మరైజ్ చేసాడు మెగా స్టార్ .


ఇక అన్నయ్య మెగా స్టెప్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న మెగా తమ్ముళ్లకు స్మాల్ స్టెప్స్ తో ట్రైలర్ లో స్మాల్ ట్రీట్ ఇచ్చి విజిల్స్ వేయించే ఇలాంటి స్టెప్స్ ఎన్నో ఉన్నాయని టేస్ట్ చూపించాడు చిరు.

చాలా ఏళ్ల తర్వాత రి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ట్రైలర్ లో ఎలా ఉన్నానురా అంటూ మెగా ఫాన్స్ ఆడియన్స్ ను అడగగానే అడిగేశాడు మెగా స్టార్. ఈ డైలాగ్ కి నీలాగే ఉన్నావ్ అంటూ అలీ చెప్పే డైలాగ్ ఈ సినిమాలో ఇలాంటి ఎన్నో చమక్కులతో కూడిన డైలాగ్స్ ఉన్నాయని చెప్పకనే చెప్పారు ఖైదీ యూనిట్.

ఇక ఈ ట్రైలర్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ కాజల్ అగర్వాల్ చిరు తర్వాత ఖచ్చితంగా తన గ్లామర్ తో మరో సారి ఎట్రాక్ట్ చేయబోతోందని అర్ధం అవుతుంది. ఇప్పటి వరకూ ఈ సినిమాలో కాజల్ సీన్స్ ను చూపించకుండా ఊరించిన యూనిట్ ఎట్టకేలకి ట్రైలర్ లో కాజల్ సీన్స్ తో ఎట్రాక్ట్ చేశారు. ఇక మెగా స్టార్-కాజల్ కెమిస్ట్రీ సినిమాలో అదిరిపోనుందే విషయం అర్ధం అవుతుంది.

ట్రైలర్ లో అభిమానుల్ని ఎట్రాక్ట్ చేసిన మరో ఎలిమెంట్ బాసు చూపించు నీ గ్రేసు అని ఫిమేల్ వాయిస్ రాగానే స్టైలిష్ గా సైడ్ నుంచి చిన్న ఎంట్రీ ఇవ్వడం.

ఇక ఈ ట్రైలర్ లో ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేశాయి డైలాగ్స్ . ‘కష్టం వస్తదో కార్పొరేట్ సిస్టమ్ వస్తదో రమ్మను అంటూ మెగా స్టార్ చెప్పే డైలాగ్ తో పాటు ‘వడ్ల గింజ నుంచి తాలింపు గింజ దాకా కంది పప్పు నుంచి కరివే పాకు దాకా మినప నుంచి మిరప దాకా అన్ని పల్లెటూర్ల నుంచే రావాలి’ అంటూ రైతుల గురించి చిరు చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ సినిమా పై హైప్ పెంచేసింది.

‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ కు మరో స్పెషల్ ఎలిమెంట్స్ ఫైట్స్. కనల్ కణ్ణన్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఈ సినిమాకు మరో హైలైట్స్ గా నిలవబోతున్నాయి.

చివరిగా ‘పొగరు నా వొంట్లో వుంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో అన్ని అంశాలతో కూడిన ట్రైలర్ ను ముగించిమెగా ఫాన్స్లో జోష్ నింపేసి  సినిమాపై అంచనాలు పెంచే సాడు  మెగా స్టార్ ..


 
Top