సరిగ్గా వారం రోజులలో ఈ పాటికి ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదల అయిపోతుంది. ఈ సినిమాకి సంబంధించి అనేక న్యూస్ లు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ - ట్రైలర్ మాత్రమే బాకీ ఉండగా సినిమా అవుట్ పుట్ కి సంబంధించి అనేక వార్తలు గుప్పు మంటున్నాయి. రెండున్నర గంటల కరక్ట్గగా నిడివి ఉన్న ఈ చిత్రం కోసం ఎక్కడా కటింగ్ లు చెయ్యద్దు అని చిరు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తమిళ కత్తి కంటే తక్కువ నిడివి ఉన్నా కూడా ఈ మధ్య కాలం లో రెండున్నర గంటలు అంటే జనాలకి అది పెద్ద టైం లాగా అనిపిస్తోంది కాబట్టి కటింగ్ లు ఎక్కువగానే చేస్తున్నారు. సినిమాలు క్రిస్పీ గా కానిచ్చేస్తున్నారు మనోళ్ళు కానీ చిరు మాత్రం ఈ సినిమాకి ఎలాంటి కటింగ్ లూ ఒద్దు అంటూ చెప్పెసారట. రామ్ చరణ్ - వినాయక్ లు గట్టిగా బలవంతం పెట్టినా తనకి అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా అనిపిస్తోంది అని కట్ చెయ్యాల్సిన పనీ ట్రిమ్ చెయ్యాల్సిన పనీ లేదని గట్టిగా చెప్పేశాడట చిరంజీవి. అయితే ఈ సినిమా అవుట్ పుట్ మీద చిరు ఫుల్ హ్యాపీగా ఉన్నా చరణ్ మాత్రం క్లైమాక్స్ విషయం లో కాస్త సంశయం గానే ఉన్నాడట. ఖైదీ ఒరిజినల్ స్క్రిప్ట్ కత్తి తో పోల్చుకుంటే క్లైమాక్స్ ఒకింత డల్ అయ్యింది అంటున్నారు. సినిమాని ఫాన్స్ కి నచ్చేలా తీయడం లో వినాయక్ సూపర్ సక్సెస్ అయ్యాడు అని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అడ్డరగోట్టేసాడు అనీ కత్తి కంటే తెలుగులోనే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వచ్చింది అంటున్నారు. చిరు ఎంట్రీ సీన్ , 3 పాటలు , ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవన్నీ పర్ఫెక్ట్ గ వచ్చాయి అనీ ఇవే ఖైదీ కి పాజిటివ్ లు గా చెబుతున్నారు. పోసాని కృష్ణ మురళి పంచ లు కూడా బ్రహ్మాండంగా పేలాయి అనేది వినిపిస్తున్న టాక్. పోసాని కృష్ణ‌ముర‌ళి పంచ్‌లు బాగా పేలాయ‌ని, బ్ర‌హ్మానందం పాత్ర‌ని మ‌రోసారి బ‌కరా చేసేశార‌ని, ఈ సినిమాలో బ్ర‌హ్మీ వినోదం అంతంత మాత్రంగానే పండింద‌ని తెలుస్తోంది. క్ల‌యిమాక్స్ వీక్‌గా ఉంద‌ని టాక్‌. అయితే మిగిలిన సినిమా అంతా చిరు త‌న చ‌రిష్మాతో న‌డిపించేశాడ‌ని, స్టెప్పులైతే ఇక చూసుకొనే ప‌నే లేద‌ని ఈ సినిమా ఆల్రెడీ చూసిన‌వాళ్లు చెబుతున్నారు. ఇంద్రా సినిమా టైం లో చిరు లో ఉన్న గ్లామర్ ఇప్పుడు మళ్ళీ ఫాన్స్ చూడబోతున్నారు అని సమాచారం.
 
Top