మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘ఖైదీ నెం 150’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తుంది. ఒకవైపు ‘ఖైదీ నెం 150’ చిత్రానికి సంబంధించిన బిజినెస్ రికార్డ్ లతో మోత మోగుతుంటే...మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ ఫంక్షన్ పై ఫ్యాన్స్ లో తెగ ఆసక్తి నెలకొంది. అయితే చాలా గ్యాప్ తరువాత ‘ఖైదీ నెం 150’ చిత్రంతో మెగాస్టార్ ఎంట్రి ఇవ్వటంతో...ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నదానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్ఛలు జరుగుతున్నాయి.
చిరంజీవి ఎప్పుడైతే సినిమాలకి బై చెప్పాడో...అప్పటి నుండి టాలీవుడ్ లో బిజినెస్ ట్రెండ్ మారుతూ వస్తుంది. చిన్న సినిమాలు సైతం 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా కచ్ఛితంగా 100 కోట్ల రూపాయలు సాధించాల్సిందే అనేది ఇండస్ట్రీ లెక్క.
చాలా గ్యాప్ తరువాత వస్తున్న మెగాస్టార్ సినిమా కావటంతో....అందరూ ఈ రేంజ్ కలెక్షన్స్ ని ఊహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ మూవీపై కొంత నెగిటివ్ టాక్ ని కొంత మంది స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఈ మూవీ కలెక్షన్స్ ని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంతే కాకుండా అసలు ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఉన్న సత్తా ఏంటి? అనేది ‘ఖైదీ నెం 150’చిత్రంతోనే బయటకు రానుంది.
‘ఖైదీ నెం 150’ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ 100 కోట్ల రూపాయలను దాటితే....మెగాస్టార్ కి ఇండస్ట్రీలో ఇంకా క్రేజ్ ఉన్నట్టే అనేది ఇండస్ట్రీ పెద్దల లెక్క. అలా కాకుండా 100 కోట్ల రూపాయల మార్క్ ని ‘ఖైదీ నెం 150’ చిత్రం దాటలేకపోతే...ఇక చిరు కి ఇండస్ట్రీలో మార్కెట్ తగ్గినట్టే అని అంటున్నారు. మొత్తంగా‘ఖైదీ నెం 150’ కలెక్షన్స్ పై చిరంజీవి సత్తా ఏంటో తెలియనుందని అంటున్నారు.