దాదాపు 8 సంవత్సరాల గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘ఖైదీ నెం 150’. ఈ మూవీని చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకవైపు ఫ్యాన్స్ లో ‘ఖైదీ నెం 150’ చిత్రం హడావిడి నడుస్తుంటే...మరోవైపు ‘ఖైదీ నెం 150’ చిత్రంపై కాంట్రవర్సీలు నడుస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నెం 150’ చిత్రంలో తను అలా నటించటం తప్పు...ఇలా చేయటం తప్పు వంటివి చర్చలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఈ టాక్స్ అన్నింటిని పక్కన పెడితే...చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’కి సంబందించిన అప్ డేట్స్ ఆసక్తికరంగా మారాయి. తాజాగా రామ్ చరణ్ తేజ్‌ ఫేస్ బుక్ ద్వారా ‘ఖైదీ నెం 150’ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ ఫంక్షన్ వేధికని అఫిషియల్ గా చెప్పారు.
అలాగే పవన్ కళ్యాణ్‌ సైతం ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ఈరోజే నేను ఆయన్ను ఫంక్షక్ కు ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాను. ముందే చెప్పాను పిలవడానికి ఆయనేం చిన్నపిల్లాడు కాదు. పిలవడం నా భాద్యత, డ్యూటీ. పిలుస్తాను. రావడం రాకపోవడం ఆయనే నిర్ణయించాలి’ అంటూ సరదా సమాధానం ఇచ్చారు. అయితే రామ్‌ చరణ్‌ ఇచ్చిన ఆ సమాధానంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వస్తే..వస్తారు? అన్నట్టుగా పవన్ పై రామ్‌ చరణ్‌ చేసిన కామెంట్స్ కి.... పవన్ కళ్యాన్‌ సైతం “వస్తాను..వీలుంటే” అన్నట్టు చెప్పారు. చరణ్‌ కి పవన్ కళ్యాణ్‌ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్‌ స్వయంగా తీసిన సినిమాకి పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారు? అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. 
 
Top