యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్లో సినిమాకు సిద్ధమయ్యారు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత అరడజను కథల దాకా విన్న తారక్ తన మనసుకి నచ్చిన కథ చెప్పడంతో బాబి డైరక్షన్లో సినిమా ఓకే చేశాడు. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ మూవీ తర్వాత తారక్ ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రం సినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు తీసిన త్రివిక్రం కేవలం ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లతో మాత్రం తీయలేదు.
చెర్రితో ప్లానింగ్ లో ఉండగా ఈసారి త్రివిక్రం తారక్ సినిమా కన్ఫాం అనేస్తున్నారు. ఇక ఆ సినిమా తర్వాత కూడా తారక్ చేయబోయే సినిమా విక్రం కుమార్ డైరక్షన్లో ఉంటుందని అంటున్నారు. 13బి సినిమా నుండి ఇష్క్, మనం, 24 సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన విక్రం కుమార్ ప్రస్తుతం అఖిల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత తారక్ తో సినిమా ఉంటుందని టాక్. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు జరిగాయట.   
జనతా గ్యారేజ్ తర్వాత కథల మీద మరింత దృష్టి పెట్టిన తారక్ విక్రం కుమార్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడట. అసలైతే ఇంతకుముందు విక్రంతో అల్లు అర్జున్ కూడా ఓ సినిమా చేసే ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. అఖిల్ సినిమా పూర్తి కాగానే తారక్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు విక్రం. మరి డిఫరెంట్ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా జూనియర్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
 
Top