మెగా హీరోల మధ్య విబేధాలు మరోసారి ప్రస్పుటమయ్యాయి. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ కూ చిరంజీవి గ్రూప్ హీరోలకూ మధ్య గ్యాప్ మరోసారి వెలుగు చూసింది. గతంలో ఈ రెండు వర్గాలకూ చెందిన సినిమా ఫంక్షన్లలో ఎన్నోసార్లు విబేధాలు బయటపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఈ మెగా గ్రూప్ ఈవెంట్లకు అంటీముట్టనట్టు ఉంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా.. చిరంజీవి 150వ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో పవన్, మెగా హీరోల రిలేషన్స్ పల్స్ ఎలా ఉందో తెలిసిపోతోంది. ఈ ఫంక్షన్ ను గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్ ను చిరు కుమారుడు  రాం చరణ్‌ తన భుజాన వేసుకున్న సంగతి తెలిసిందే. 


మరి ఈ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ వస్తారా రారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇదే ఇష్యూపై రాంచరణ్ స్పందించిన తీరు ఆసక్తి రేపుతోంది...  పవన్‌ కల్యాణ్‌ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వస్తారా అని ఒక అభిమాని ప్రశ్నించారు. ఇదంతా ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో చరణ్‌ లైవ్ చాట్ చేసిన సమయంలో జరిగిన సంభాషణ.. 
లైవ్ లో స్పందించిన రాంచరణ్.. ఇదొక బిగ్ క్వశ్చన్‌.. ఆయనను కలవడానికి నేనే స్వయంగా వెళ్తున్నా... మీకు ముందే చెప్పా... పిలవడానికి ఆయనేమీ చిన్నపిల్లాడు కాదు... ఇన్విటేషన్ ఇవ్వడం వరకే మన బాధ్యత... ఇన్విటేషన్ ఇస్తాం...  రావాలా వద్దా అన్నది ఆయనే డిసైడ్ చేసుకుంటారు.. అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. 
 
Top