ఓ సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరో, హీరోయిన్ ఉండాలి... హీరోలతో పాటుగా హీరోయిన్లు కూడా కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు. హీరో అంటే సినిమాను ఒంటి చేత్తో నడిపిస్తాడు. ఫైట్లూ గట్రా చేస్తాడు కాబట్టి డిమాండ్ ఎక్కువ. కోట్లు ఇస్తాం.. మరి హీరోయిన్ కు ఎందుకు కోట్లు ఇస్తున్నారు.. ఈ ప్రశ్నలకు ఓ తమిళ దర్సకుడు ఇచ్చిన సమాధానం కలకలం రేపింది.
కథానాయికలు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్లు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీలు లేదు అంటున్నాడా డైరెక్టర్. అతనే తమిళ దర్శకుడు సురాజ్. విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వం వహించిన ‘ఒక్కడొచ్చాడు’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు. ఇంకా ఏమన్నాడో మీరే చూడండి.
కోట్ల కొద్దీ పారితోషికం తీసుకుంటున్నది అలా నటించడానికేగా?... కింది క్లాస్ ఆడియన్స్‌ని కథానాయికలు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, ఆనందపరచాలి.. ఒకవేళ కాస్ట్యూమ్ డిజైనర్ కనక కథానాయికలు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్లు కవర్ చేసేలా డిజైన్ చేస్తే... పొడవు తగ్గించమని నిర్మొహమాటంగా చెబుతా.. హీరోయిన్‌కి అసౌకర్యంగా అనిపించినా నాకేమీ సంబంధం లేదు. ఆ డ్రెస్ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా... అంటున్నాడు సురాజ్..
అంతేనా.. ‘ప్రేక్షకులు అసలు థియేటర్‌కి వచ్చేదే హీరోయిన్లను ‘అలా’ చూడ్డానికే’ అంటూ సురాజ్ క్లారిటీ చెప్పడం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవేళ కథానాయికలు తమ అందచందాల్ని కాకుండా, యాక్టింగ్ టాలెంట్‌ని మాత్రమే చూపించుకోవాలంటే టీవీ సీరియల్స్‌లో చూపించుకోమనండి.. అంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ పై టాప్ హీరోయిన్లు తమన్నా, నయనతార సహా అంతా ఈ దర్శకుడిని మాటలతో ఉతికి ఆరేస్తున్నారు.