తెలుగు చిత్ర సీమను నాటి సావిత్రి జమున లనుండి నేటి అనుష్క, కాహల్, తమన్నా ల వరకు అనేక మంది శాసించారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ రైజింగ్ లో ఉంది. ఏ ముహూర్తాన ఆమె తన తొలి తెలుగు సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేసిందో కానీ, అప్పట్నుంచీ వరుస అవకాశాలతో పూర్తిగా బిజీగా ఉంది. రామ్ చరణ్ తో వరుస సినిమాలు చేసి కుర్ర హీరోయిన్లు సవాల్ విసిరి వాళ్ళు కుళ్లు కునేలా చేసింది.

రకుల్ ప్రీత్ చాలా అడ్జెస్టబుల్ అట. అందాల ఆరబోతకు అడ్డుచెప్పదు. అటు రెమ్యూనరేషన్ విషయంలోనూ పట్టువిడుపులు ప్రదర్శిస్తుంది. తన పాత్ర విషయంలో పెద్దగా బెట్టు చేయదు. కాస్త ఎడ్జస్ట్ కమ్మన్నా అవుతుంది. అందుకే రకుల్ అంటే అందరి కీ హాట్ ఫేవరెట్ హీరోయిన్.ఇప్పుడు కాజల్ తర్వాత రామ్ చరణ్ రకుల్ తోనే రెండో సినిమా చేశాడంటే, రకుల్ ప్రవర్తనేంటో మెగాభిమానులకు బాగా అర్థమైపోయింది. ఇతర హీరోలకు కూడా రకుల్ హాట్ ఫేవరెట్టే. రకుల్ డేట్స్ కూడా దొరకని పరిస్థితి ఉందంటే ఆమె ఎంత బిజీగా ఉందో తెలుస్తోంది.

రామ్ చరణ్ తో తొలి సినిమా బ్రూస్ లీ అనుకున్నంతగా ఆడలేదు. దీంతో రకుల్ కాస్త డిజప్పాయింట్ అయింది. కానీ అనుకోని విధంగా రామ్ చరణ్ తరవాత మూవీ "ధృవ" లో కూడా రకుల్ నే తీసుకోవడం, అదీ అద్భుత విజయాలు మూటగట్టుకోవటం రకుల్ జీవితంలో ఒక అదృష్ట దేవత వరం లభించిందో ఈ సుందరాంగికి. 
 
Top