మెగాస్టార్ చిరంజీవికి తాను అభిమాని అంటూ ఆ మెగాస్టార్ మీద తన సెటైరికల్ ట్వీట్స్ తో సరదా తీర్చుకునే ఆర్జివి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీ నుండి ఏ పోస్టర్ రిలీజ్ అయినా విరుచుకు పడుతున్నాడు. ఇక నిన్న రిలీజ్ అయిన ఖైదిలోని చిరు పోస్టర్ పై మరోసారి విజృంభించి ట్వీట్స్ వేశాడు వర్మ. చేతిలో కత్తితో ఐరన్ రాడ్ మీద కూర్చున్న చిరు స్టిల్ చూసిన ఆర్జివి చిరంజీవిని ఈ స్టిల్ కోసం ఒప్పించిన డిజైనర్.. ఇంకా డైరక్టర్ కాళ్లకు దండం పెట్టాలి.

ఇక ఈ ఫోజు ఇచ్చేందుకు సహకరించిన చిత్రయూనిట్ అందరి ఫోన్ నెంబర్లు ఇవ్వండని.. కచ్చితంగా ఈ డిజైనర్ కు చరిత్రలో కొన్ని పేజీలు ఉండాల్సిందే అంటూ విమర్శలను గుప్పించాడు. వర్మ ఏం ట్వీట్ చేసినా అది వ్యంగ్యంగా అనిపించినా తాను ఏం చెప్పదలచుకున్నాడో కచ్చితంగా అర్ధమవుతుంది. నిన్న మొన్నటిదాకా వంగవీటి రాధతో రంగ ఫ్యాన్స్ తో గొడవలు పడ్డ ఆర్జివి తాజాగా చిరు ఖైది పోస్టర్ మీద తన దృష్టి పెట్టాడు. 

చిరు ఫ్యాన్స్ వర్మని టార్గెట్ చేయడం మాములే అనుకోండి. ఏది ఏమైనా 9 ఏళ్ల తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ సినిమాకు వర్మ చేస్తున్న ఈ నెగటివ్ పబ్లిసిటీ సినిమాకు ఏమేరకు ఉపయోగపడుతుందో ఏమో కాని ట్వీట్స్ మాత్రం చిరుని ఘోరంగా అవమానించేలా ఉన్నాయన్నది వాస్తవం. వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా రాం చరణ్ ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న సినిమా రిలీజ్ అవుతుంది. 
 
Top