ఒక సినిమా పై విపరీతమైన అంచనాలు పెరిగిపోవడం కూడ ఒకొక్కసారి ఆసినిమాకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాల విషయంలో మితిమీరిన హైప్ ఏమాత్రం మంచిది కాదు అని గత అనుభవాలు చెపుతున్నాయి.
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో సంక్రాంతి రేస్ కు జనవరి 12న రాబోతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీ పై సాధారణ ప్రేక్షకులలో కూడ పెరిగిపోతున్న హైప్ దర్శకుడు క్రిష్ ను కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాకు అనవసర హైప్ క్రియేట్ చేయవద్దని క్రిష్ తన టీమ్ కు సూచనలు ఇచ్చినట్లు టాక్.
ఈ సినిమా ట్రైలర్ వచ్చాక విపరీతంగా పెరిగిపోయిన ఈసినిమా క్రేజ్ ఈమధ్య జరిగిన ఆడియో లాంచ్ తరువాత ‘శాతకర్ణి’ గొప్పతనం గురించి తెలుగు చరిత్ర గురించి తెలుసుకున్న నందమూరి అభిమానులు అదేవిధంగా సాధారణ ప్రేక్షకులు కూడ ఈసినిమా పై విపరీతమైన అంచనాలు పెట్టేసుకుంటున్నారు. దీనికితోడు ఈ సినిమా పాటల వీడియోలు కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉండటంతో ఈమూవీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
అయితే గత సంక్రాంతికి కోన వెంకట్ డైరక్టర్ శ్రీవాస్ లు కలసి బాలకృష్ణ మూవీ ‘డిక్టేటర్' కు భారీ హైప్ తెచ్చేశారు. బాలయ్య కెరియర్లోనే ఇదో గొప్ప సినిమా అంటూ చాల పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. తీరా ధియేటర్లలోకి వచ్చాక సినిమా డిజాష్టర్ మారిపోయింది. దీనికి కారణం అప్పట్లో ‘డిక్టేటర్’ పై పెరిగిపోయిన అంచనాలు. ఒక ప్రక్కన ‘నాన్నకు ప్రేమతో’ మరో ప్రక్కన ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి సినిమాలు ఉండటంతో ‘డిక్టేటర్’ అస్సలు నిలదొక్కుకోలేకపోయింది. దీనికి కారణం అప్పట్లో ఈసినిమా పై వచ్చిన ఓవర్ హైప్ కారణం అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేసారు.
దీనితో ఇప్పుడు ‘శాతకర్ణి’ విషయంలో ఏ మాత్రం ఓవర్ హైప్ చేయకుండా ఇప్పటివరకు క్రియేట్ అయిన ఇమేజ్ ను మరో కొద్దిరోజులు కొనసాగించి ఈసినిమా విడుదలకు మూడు రోజులు ముందు నుంచి ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య శ్రియల ఇంటర్యూలు అదేవిధంగా హేమమాలినితో కూడా ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తారని తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తూ ఉంటే క్రిష్ ‘శాతకర్ణి’ ప్రమోషన్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది..