ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటి వరకూ నెంబర్ వన్ లో టాప్ హీరోయిన్స్ అందరూ ఈ బ్యూటీ స్పీడ్ కి తట్టుకోలేకపోతున్నారనే చెప్పాలి. తమన్న, సమంత, అనుష్క, శ్రుతిహాసన్ వంటి హీరోయిన్స్ సైతం రకుల్ ప్రీత్ సింగ్ వేగానికి బ్రేకులు వేయలేకపోతున్నారు. తాజాగా సమంత, తమన్నల రికార్డ్ ని రకుల్ ప్రీత్ సింగ్ బ్రేక్ చేయటంతో ఇప్పుడు ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...రకుల్ ప్రీత్ సింగ్ ఫిల్మ్ కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుత ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక భారీ సెట్ రెడీ అవుతుంది. ఇందుకోసం 3 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట.
ఇప్పటి వరకూ పాటల కోసం పెద్ద దర్శకులు కోటి రూపాయలకి మంచి సెట్స్ కోసం ఖర్చు చేయలేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ కోసం బోయపాటి 3 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడు. అలాగే కోలీవుడ్ లోని విజయ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు కోటిన్నర రూపాయలను తీసుకుంటున్నారు.
ఇప్పటికే స్పెషల్ సాంగ్స్ కోసం కోటి రూపాయలను తీసుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో సమంత, తమన్న ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి రకుల్ ప్రీత్ సింగ్ నెంబర్ వన్ లిస్ట్ లోకి వచ్చింది. దీంతో సమంత, తమన్నల పేరు మీద ఉన్న హైయస్ట్ సాంగ్ రెమ్యునరేషన్ కాస్త రకుల్ ఖాతాలోకి వచ్చిందని అంటున్నారు.