ట్విట్టర్లో మెగా బ్రదర్‌పై అసహనపు కామెంట్లు చేసిన సంచలనాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ.. అదే ట్విట్టర్లో నాగబాబు అన్నయ్య చిరంజీవికి సలహాలు ఇస్తూ, ఆయన్ను పొగుడుతూ ట్వీట్లు చేశాడు. ప్రి రిలీజ్ ఫంక్షన్ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నాగబాబును తీసుకెళ్లవద్దని, అతడుంటే అలాంటి కార్యక్రమాలు నాశనమవుతాయని అన్నాడు. 'ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి సలహా ఇచ్చావో అందరికీ తెలుసు' అంటూ నాగబాబుకి వర్మ చురక అంటించాడు.
'నాగబాబు సార్, మీకు ఇంగ్లిష్‌ అర్థం కాదు కనుక, విద్యావంతుడైన స్నేహితుడి ద్వారా నా ఇంగ్లిష్‌ ట్వీట్లు తర్జుమా చేయించుకుని తెలుసుకోండి' అంటూ సూచించాడు. చిరంజీవి కుటుంబానికి పవన్ కల్యాణ్, రాంచరణ్, సాయి ధరమ్, వరుణ్, బన్నీ వంటి సానుకూలతలను ఇచ్చిన దేవుడు... బ్యాలెన్స్ కోసం నాగబాబు గారిని ఇచ్చాడు" అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. గత రాత్రి కురిపించిన ట్వీట్ల వర్షాన్ని కొనసాగిస్తూ, పలువురు ప్రముఖులు పెట్టిన కోట్స్ ను ప్రస్తావించాడు. "గాజు అద్దాల్లో నివసిస్తున్న వారు ఇతరులపై రాళ్లు విసరకూడదు  భగవద్గీత", "జీవితంలో విఫలమైన వాళ్లు ఇతరులను విమర్శించడం అంటే, తుపాను ముందు నోటితో గాలిని ఊదినట్టే - ఫ్రాంక్లిన్ ఫోయర్" అని ట్వీట్లు పెట్టాడు.
ఖైదీ నెంబర్ 150' సినిమా వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మెగా ఫ్యామిలీకి ట్విట్టర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్టులో ... ''నాగబాబు గారూ, మీరు ట్విట్టర్‌ లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద, అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను.  కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది. కనుక నేను చాలా నిజాయతీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్'' అంటూ వర్మ తన ట్వీట్ల పరంపరను వదిలారు.
 
Top