తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఎంతో బిజీగా మారిపోయింది.  మళియాల ఇండస్ట్రీలో వచ్చిన ఈ అందాల బొమ్మ తెలుగు, తమిళంలో తన సత్తా చాటింది.  ఇక ఏం మాయ చేశావ చిత్రంలో నటించిన నాగ చైతన్యతో నిజంగానే ప్రేమలో పడిపోయింది.  కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలతో చెప్పడం వారు కూడా ఓకే అనడంతో ఇక పెళ్లి ముహుర్తం ఒక్కటే బాకీ ఉంది.  జనవరిలో నిశ్చితార్థం జరుపుకునే యోచనలో ఉందీ ఈ జంట.  

అయితే సమంత, నాగచైతన్య మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు..ఎందుకంటే ఈ మద్య ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తూ టూర్లు వేస్తున్నారు.  తాజాగా క్రిస్మస్ వేడుకల కోసం కాబోయే భర్త అక్కినేని నాగచైతన్య తో కలిసి బీచ్ కి వెళ్లిన సమంత బికినీ వేసి ఫోటోకి ఫోజిచ్చి ఆ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి అక్కినేని ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చింది.  గత కొంత కాలంగా చైతూ, సమ్మూ కలిసి ఒకేదగ్గర ఉంటున్నారు. కాగా క్రిస్మస్ కావడంతో బీచ్ కెళ్ళి ఎంజాయ్ చేసింది సమంత . అయితే బికినీ లో ఫోజివ్వడమే కాకుండా ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.  
సమంతో ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్తుంది..అంలాంది ఇలాంటి చౌకబారు ఫోటోలు పంపుతూ వారి ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఏమాత్రం బాగోలేదని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు . త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోనున్న ఈ జంట బీచ్ లో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇలా బికినీ ఫోటో పెట్టడం తో యమా హాట్ అయ్యింది వ్యవహారం.
 
Top