అమీర్ ఖాన్ ‘దంగల్’ సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఎంత మంచి సినిమాకు అయినా ఎదో ఒక నెగిటివ్ పాయింట్ వెతికే విమర్శకులు ‘దంగల్’ విషయంలో ఒక్క నెగిటివ్ పాయింట్ ను కూడ వెతికి పట్టుకోలేక పోతున్నారు.
ఈసినిమా విడుదలైన మొదటి మూడు రోజులలోనే 100 కలక్షన్స్ ను దాటిపోవడంతో ఈమూవీ 1000 కోట్ల సినిమాగా మారుతుంది అన్న అంచనాలతో బాలీవుడ్ మీడియా ఈసినిమాను ఆకాశానికి ఎత్తేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలోని అర్బన్ సెంటర్లలో కూడ ఈమూవీకి అద్భుతమైన కలక్షన్స్ వస్తున్నాయి.
ఇప్పుడు ఈ పరిస్థుతులు హీరో వెంకటేష్ కు తలనొప్పిగా మారాయి అన్న వార్తలు వస్తున్నాయి. కథా పరంగా చూసుకుంటే వెంకటేష్ నటిస్తున్న ‘గురు’ సినిమాకు ‘దంగల్’ సినిమాకు చాల పోలికలు కనిపిస్తున్నాయి. మాధవన్ నటించిన హిందీ మూవీ ‘సాలా ఖాద్దుస్’ వెంకటేష్ ‘గురు’ రీమేక్ అన్న విషయం తెలిసిందే.
ఈమూవీలో హీరో పాత్ర తన పంతాన్ని నెరవేర్చుకోవడం తన స్థాన్నాన్ని వదులుకుని శిష్యురాలి గెలుపుకోసం తపించే పాత్రగా వెంకటేష్ పాత్ర కనిపిస్తుంది. అయితే ఈ మూల కథ ప్రజెంటేషన్ లో మార్పులు ఉన్నా ‘దంగల్’ సునామీతో తెలుగు ప్రేక్షకులు ఈ తేడాను గ్రహిస్తారా ? అన్న భయం వెంకటేష్ ని వెంటాడుతోంది అని టాక్.
సంక్రాంతి రేస్ తరువాత వచ్చే నెలలో రిపబ్లిక్ డేని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ మూవీ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయిపోయింది.ఈసినిమాలోని పాత్ర కోసం వెంకటేష్ డాక్టర్ల సలహాలను కూడ లెక్క చేయకుండా ఈ వయస్సులో బాడీ బిల్డర్ గా కనిపించడానికి చాల కష్టాలే పడ్డాడు. దీనితో తాను పడ్డ కష్టం వథా కాకుండా ‘గురు’ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తే ఎలా ఉంటుంది అని వెంకటేష్ ప్రస్తుతం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్..