అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతల ప్రేమ కబుర్లు.. పెళ్లి ముచ్చట్లు ఇప్పటికే తెలుగు సినీ అభిమానులకు తెలిసినవే. ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీరు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇందుకు ముహూర్తాలు వెదుకుతున్నారు. ఇప్పటికే నాగ చైతన్య తమ్ముడు అఖిల్ ఎంగేజ్ మెంట్ అయిపోవడంతో చైతన్య కూడా ముహూర్తాలు వెదికే పనిలో ఉన్నాడు.
ఐతే.. సాధారణంగా సినిమా హీరోయిన్లు పెళ్లి నిశ్చయమైతే.. ఒక్కసారిగా హోమ్లీగా మారిపోతారు. ఎక్స్ పోజింగ్ తగ్గించేస్తారు.. డ్రెస్సింగ్, లుక్స్ , బిహేవియర్ అన్నీ మారిపోతాయి.. కానీ ఇది అందరి విషయంలోనూ ఒకేలా ఉండదని సమంతను చూసి తెలుసుకోవచ్చు. అక్కినేని ఇంటి కోడలు కాబోతున్నా.. సమంత బిహేవియర్ లో మాత్రం మార్పు కనిపించడం లేదు. 
అంతేకాదు.. అంతకుముందు కన్నా ఒకింత డోస్ పెంచేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. నాగ చైతన్యతో లవ్ ఎఫైర్ బయటపడిన తర్వాత... అక్కినేని ఫ్యామిలీ ఆ విషయం కన్ ఫామ్ చేసిన తర్వాత బయటికొచ్చిన సమంత ఫోటోలు కూడా హాట్ హాట్ గానే ఉంటున్నాయి. తాజాగా ఆమె ట్విట్టర్ లో పెట్టిన ఓ పిక్ హాట్ టాపిక్ అయ్యింది.
తనకు సముద్రానికున్న లక్షణాలున్నాయంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పిక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఓ బీచ్ లో దిగిన  ఫోటో ఆ కింద.. అందం, అంతుచిక్కని రహస్యాలు, సువిశాల తత్వం, స్వేచ్ఛ.. ఇవన్నీ సముద్రానికీ తనకూ ఉన్న పోలికలు అంటూ భావికవిత్వం ఒలకబోసింది. ఫోటో అసభ్యంగా లేకపోయినా.. ఇంకా ఇలాంటి బీచ్ ఫోటోలు తనే స్వయంగా ట్విట్టర్ లో పెట్టడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది.
 
Top