సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కించిన వర్మ, ఎన్నో వివాదాలు బెందిరింపుల నడుమ ఈ సినిమాను శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.  ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టు ముట్టిన విషయం తెలిసిందే. ఆ మద్య రంగా ఫ్యామిలీతో కూడా చర్చలు జరిపారు..కానీ అది పెద్ద సఫలం కాలేదు. ఏది ఏమైనా వర్మ మాత్రం సినిమా రిలీజ్ చేస్తానని పంతం పట్టి శుక్రవారం రిలీజ్ చేశారు.

తాజాగా మరోసారి వర్మపై వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధ ఫైర్ అయ్యారు.  డబ్బు కోసం వంగవీటి జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టేవాళ్లమన్నారు.ఇవాళ వంగవీటి మోహనరంగా 29వ వర్దంతిని నగరంలో నిర్వహించనున్నారు. విజయవాడలో 50 ప్రాంతాల్లో వంగవీటి రాధా ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఉదయం వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి రాధాకృష్ణ నివాళులర్పించారు. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. రంగాను హత్య చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇక డబ్బు కోసం తన తండ్రి జీవితాన్ని కించపరిచారని, ఇందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని వంగవీటి రాధ హెచ్చరించారు. అంతేగాక, పకోడిగాడు సినిమా తీశాడు, ఆ యదవ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతే కాదు.. ఇప్పటికే వంగవీటి సినిమాపై రంగా ఫ్యాన్స్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. కాపుల మనోభావాలను కించపరిచేలా 'వంగవీటి' సినిమాను చిత్రీకరించారని రంగా అభిమానులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా టైటిల్‌తో పాటు కాపులను కించపరిచే సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  
 
Top