‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తీయాలి అన్నది సీనియర్ ఎన్టీఆర్ కోరిక అన్న విషయం తెలిసిందే. ఈసినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు 110 సీన్స్ తో ఒక రెడీ స్క్రిప్ట్ ను కూడ ప్రముఖ సినీ జర్నలిస్టు ప్రదీప్ అలనాటి యాడ్ ఫిలిం మేకర్ ప్రసాద్ అనే వ్యక్తుల చేత నందమూరి తారకరామారావు జీవించి ఉన్న రోజులలోనే సీనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ చేయించారు.
అయితే నందమూరి తారకరామారావు తాయారు చేయించిన స్క్రిప్ట్ లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కుమారుడు పులోమావి పాత్రకు సంబంధించిన ప్రాధాన్యత కూడా చాల ఎక్కువగా ఉంటుందట. ఈ పులోమావి పాత్రను విక్టరీ వెంకటేష్ చేత చేయించాలని సీనియర్ ఎన్టీఆర్ అనుకోవడమే కాకుండా వెంకటేష్ ఆపాత్రకు సరిపోతాడా అన్న స్కెచ్ లు కూడ రామారావు వేయించారని టాక్.
నందమూరి తారకరామారావు తయారు చేయించిన కథలో ‘శాతకర్ణి’ చిన్ననాటి నుండి చిట్టచివరకు తన రాజ్యం త్యజించే వరకు శాతకర్ణి స్క్రిప్ట్ ఉంటుందట. ఈసినిమాకు సంబంధించిన పాటలు కూడ రాయించిన ఎన్టీఆర్ చిట్టచివరకు ఈసినిమాను చేయకుండానే మరణించారు.
ఈ సినిమాకు సంబంధించిన ఆయుధాలు కూడ తాను జీవించి ఉన్న రోజులలోనే ఎన్టీఆర్ డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇంతగా ఎన్టీఆర్ అభిమానించిన ‘శాతకర్ణి’ పాత్రను ప్రస్తుతం తాను చేయడం దైవ కృప అని అంటున్నాడు బాలకృష్ణ.
శక కర్తగా భారతదేశాన్ని పాలించిన మహాచక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పాత్రను పోషించడం వెనుక ఉన్న అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ నందమూరి బాలకృష్ణ ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంట్గార్వ్యూలో ‘శాతకర్ణి’ సినిమాలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన ఆ శక్తికర విషయాలను బయట పెట్టాడు..