shruthi hassan dating

తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన విశ్వనటుడు కమల్ హాసన్.  ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకు తానే సాటి అనిపించుకున్న కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది..ఆయన ముద్దుల కూతురు శృతి హాసన్.  నటన, సంగీతం, డ్యాన్స్ అన్ని రంగాల్లో తనదైన శైలితో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే పవన్ తో గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన శృతి మరోసారి కాటమరాయుడు చిత్రంలో కనిపించి మురిపించబోతుంది.  
తాజాగా ఈ అమ్మడు డేటింగ్ లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఖాళీ దొరికితే లండన్ లో వాలిపోతోంది శృతి. రీసెంట్ గా పవన్ తో చేస్తోన్న కాటమరాయుడు మూవీ షెడ్యూల్ పొల్లాచ్చిలో ఫినిష్ కాగానే లండన్ చేరిపోయింది శృతి.అక్కడే ఓ యంగ్  మ్యుజిషియన్ తో శృతి డేటింగ్ చేస్తోందట.  దీనిపై స్పందించిన శృతి మాత్రం అబ్బే అలాంటిది ఏమీ లేదని కొత్త మ్యూజిక్ ఆల్బం కోసమే తరచుగా లండన్ వెళ్తున్నానంటోంది.
శృతి కూడా సింగర్ అనే సంగతి మనకి తెలిసిందే. అందుకే న్యూ మ్యూజిక్ ఆల్బం కోసం లండన్ వెళుతున్నానని డేటింగ్ మ్యాటర్ కవర్ చేస్తోందంటున్నారు. మొత్తానికి ఓ వైపు సినిమాలు తీస్తూ మరోవైపు డేటింగ్ కూడా చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తుందని సినిమా వర్గాల గుస గుస..
 
Top