టాలీవుడ్ అగ్రకథానాయక సమంత యువనటుడు నాగచైతన్యను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబోయే భార్యాభర్తలిద్దరూ కుటుంబ ఫంక్షన్లలోను, స్నేహితుల పార్టీల్లోను జంటగా సందడి చేస్తున్నారు. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే ఈ భామ ఇవాళ ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని కాసేపు ముచ్చటించారు. ఎలా ఉన్నారు సమంత.. ఈ ఏడాది అంతా ఎలా ముగిసింది ఇలా పలు ప్రశ్నలను సంధించారు అభిమానులు. అయితే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేక సింపుల్‌గా చిన్నమాటతో సరిపెట్టుకుంది సమంత.
ఇంతకీ ఈ ప్రశ్న ఏంటనే విషయానికొస్తే.. ‘నాగార్జునకి కోడలు కాబోతున్నారు.. ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు’ అన్నదే ఆ ప్రశ్న సారాంశం. అయితే సమాధానం కోసం వేచిచూస్తున్న అభిమానికి సమాధానం ఇవ్వకపోగా అవన్నీ ఇప్పుడు అడగకండి.. ‘పెళ్లి అయ్యాక ఈ ప్రశ్న మళ్లీ అడగండి’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది సమంత. తనకు ఈ ఏడాది దంగల్ బాగా నచ్చిన సినిమా అని చెప్పంది. తెల్లవారు జాము 4:30 నిమిషాలకు నిద్రలేచి చదువుతానని చెప్పింది.
2017లో 6 సినిమాలు తనవి రిలీజయ్యే అవకాశం ఉందని సమంత తెలిపింది. ఓడిపోతానేమోనని అప్పుడప్పుడు ఆందోళన చెందుతానని పేర్కొంది. ‘తెరి’, ‘అ..ఆ’ విడుదల తర్వాత కొన్ని రోజులు ఆరు అడుగుల ఎత్తైపోయా.. 2016లో మీరు చాలా గర్వంగా ఫీలైన క్షణాలివేనంటూ బ్యూటీ తన మనసులోని మాట చెప్పింది.!. ఆఖరుగా 2017 ఏడాది ప్రణాళిక గురించి మాట్లాడుతూ.. నటన పరంగా పెద్ద రిస్క్ తీసుకునేలా కనిపిస్తోందని చెప్పారు.