మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ఖైదీనెం.150’. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ 2017 సంక్రాంతి కానుకగా రానుంది. దీంతో ఈ మూవీపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ స్ట్రాటజీని చిత్ర యూనిట్‌ భారీగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ మూవీపై అంతటా హైప్ క్రియేట్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కోసం మెగాస్టార్ తన అభిమానాన్ని ‘ఖైదీనెం.150’ చిత్రం ద్వార చాటబోతున్నారనే న్యూస్ అంతటా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ‘ఖైదీనెం.150’ చిత్రానికి సంబంధించిన ఫ్రీ షోలను చిత్ర యూనిట్ రెడీ చేస్తుందని అంటున్నారు. చిరంజీవికి ఇది 150వ చిత్రం కావటంతో...ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ 150 ఫ్రీ షోలను ప్రదర్శించాలనే ఆలోచన చేస్తుందట.
దీనికి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే దీనిని ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చిత్ర యూనిట్ ఆలోచనలు చేస్తుంది. ఇక చిరంజీవి ఆలోచన ప్రకారం ప్రతి థియోటర్ లో 100 మంది ఫ్యాన్స్ చొప్పున 150 మినీథియోటర్స్ లో ‘ఖైదీనెం.150’ చిత్రాన్ని ఫ్యాన్స్ కి ఫ్రీ షోలగా ప్రదర్శించనున్నారని అంటున్నారు. అయితే ఆ థియోటర్స్ కి సంబంధించిన లిస్ట్ ఇంకా ప్రిపేర్‌ అవ్వలేదు.
కేవలం ఫ్యాన్స్ కోసం ఈ షోలను రెడీ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం. ఫ్యాన్స్ మొదటి షోలను చూసి...వీరు చెప్పే టాక్‌ వల్ల సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. మొత్తంగా రామ్‌ చరణ్‌ చేస్తున్న ఈ ఫ్రీ షోల వల్ల తన ప్లానింగ్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి అని అంటున్నారు. అయితే జనవరి 4న ఈ మూవీకి సంబంధించిన ప్రి రిలీజ్ ఫంక్షన్ ని విజయవాడలో గ్రాండ్‌ గా జరపనున్నారు.
 
Top