మరి కొద్దిగంటలలో రాబోతున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పవన్ తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరికంటే ముందుగానే తన విశ్వరూపాన్ని బయట పెట్టాడు.  అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ విడుదలైంది.

సామాన్యంగా జీన్, టి.షర్ట్ వేసుకుని సినిమాలలో కనిపించే పవన్ తన రొటీన్ సినిమా గెటప్ కు భిన్నంగా అంచున్న ఖాదీ లుంగీతో చాల డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు పవన్. మధ్య వయస్సు వచ్చేసినా తమ్ముళ్ళ కోసం పెళ్లి చేసుకొని బ్రహ్మచారిగా ఈ సినిమాలో పవన్ కనిపించబోతున్నాడు. 

అలాంటి పవన్ ను ప్రేమ ఉచ్చులోకి దింపే ప్రియురాలిగా శ్రుతిహాసన్ కనిపించబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పవన్ అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు.  మార్చిలో రాబోతున్న తెలుగు ‘ఉగాది’ పండుగ రోజున విడుదల కాబోతున్న ఈ సినిమా పబ్లిసిటీ కౌంట్ డౌన్ నేడు విడుదలైన ఈ ఫస్ట్ లుక్ తో మొదలైంది అనుకోవాలి.  

ఒకవైపు వరసపెట్టి సినిమాలు చేస్తూ మరొక వైపు తన ‘జనసేన’ పార్టీ కార్యకలాపాలను పరుగులు పెట్టిస్తున్న పవన్ ఇమేజ్ మరింత బలపడాలి అంటే ఖచ్చితంగా ‘కాటమరాయుడు’ బ్లాక్ బస్టర్ హిట్ అయితీరాలి. దీనితో ఒక రీమేక్ ను నమ్ముకుని వస్తున్న పవన్ ఎత్తుగడలు ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి..  
 
Top