ఒక చారిత్రాత్మిక సినిమాని కేవలం 77 రోజుల షూటింగ్ తో పూర్తి చేయడం సాధారణమైన పని కాదు.  సినిమా స్క్రిప్ట్ రచన మొదలుపెట్టిన రోజు నుండి లెక్క చూస్తే ‘శాతకర్ణి’ సినిమాను 6నెలల లోపే పూర్తి చేసి ఒక సరికొత్త రికార్డ్ ను సృష్టించడమే కాకుండా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కి ఒక సవాల్ విసిరాడు క్రిష్.

ఈసినిమా షూటింగ్ మధ్యలోనే క్రిష్ పెళ్ళి జరిగింది.  అయితే క్రిష్ కనీసం 10 రోజులు కూడ తన భార్య డాక్టర్ రమ్యతో గడపకుండానే ‘శాతకర్ణి’ షూటింగ్ వైపు పరుగులు తీసాడు. ఈ విషయాన్ని స్వయంగా క్రిష్ చెప్పడమే కాకుండా తన భార్యకు ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ లో కృతజ్ఞతలు తెలియచేస్తూ తన తల్లీ తన భార్య గర్వించే సినిమాగా ‘శాతకర్ణి’ ఉంటుంది అన్న కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపధ్యంలో శ్రియ ఒక ఆశక్తికరమైన కామెంట్ ను క్రిష్ భార్య పై చేసింది. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటోను తన ట్విటర్ లో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. క్రిష్ భార్య రమ్యతో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకుంటూ "రమ్య ఎంతో అందమైన వ్యక్తి .." అంటూ ఆమెతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు రమ్య స్పందిస్తూ "ఇంతవరకూ నేను కలిసిన వాళ్లలో నువ్వు అద్భుతమైన మహిళవు .. అందమైన మనసు నీకు వుంది .. ఐ మిస్ యు" అంటూ ట్వీట్ చేసింది. 

ఇది ఇలా ఉండగా శ్రియ తన ఫేస్ బుక్ లో ఒక ఆ శక్తికరమైన ఫోటోను పోస్ట్ చేసింది. దర్శకుడు క్రిష్ కు అతడి భార్య రమ్య ‘ముద్దు’ పెడుతూ ఉంటే శ్రియ తన చేతులతో క్రిష్ తలను రమ్య వైపు తిప్పుతోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

దర్శకుడు క్రిష్ ‘శాతకర్ణి’ మేకింగ్ టెక్నిక్స్ ను చూసి రాజమౌళి లాంటి టాప్ దర్శకులు కూడ ప్రశంసలు కురిపిస్తున్న నేపధ్యంలో ‘శాతకర్ణి’ విజయం సాధిస్తే ఇలాంటి చారిత్రాత్మక సినిమాలు తెలుగు సినిమా రంగంలో చాల వచ్చే అవకాసం ఉంది..
 
Top