ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కుష్బూ తర్వాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. చాలాకాలం తర్వాత మురుగన్‌దాస్‌చిరంజీవి కలయికలో వచ్చిన ‘స్టాలిన్‌’ చిత్రంలో కనిపించింది. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి సోదరుడు పవన్‌ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
చాలా ప్రెస్టేజియస్‌గా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో దక్షిణభారత చలనచిత్ర ప్రముఖులను నటింపజేసే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్‌. ఓ పాత్ర కోసం మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వెటరన్‌ హీరోయిన్‌ ఖుష్బూను ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూనే ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ‘దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నా.
త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నా. త్రివిక్రమ్‌ బ్రిలియంట్‌ స్క్రిప్టు సిద్ధం చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా చేయబోతున్నానని, త్రివిక్రమ్‌ స్ర్కిప్టు అద్భుతంగా ఉందని ట్వీట్‌ చేసింది. తొమ్మిదేళ్ల కిత్రం మెగాస్టార్‌ చిరంజీవి (స్టాలిన్‌)తో తెలుగులో చివరి సినిమా చేశానని, ఇప్పుడు తమ్ముడు పవన్‌తో ఎంట్రీ ఇస్తున్నానని తెలియజేసింది.
 
Top