పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు మూవీకి సంబందించిన మరో పోస్టర్ న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల ముందే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కేవలం పవన్ కాళ్ళు మాత్రమే కనబడుతున్న ఈ పోస్టర్ ఫుల్ పిక్చర్ జనవరి 1న రిలీజ్ అవుతుందట. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కిశోర్ పార్ధసాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుందని తెలుస్తుంది.  

కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా జోష్ ఫుల్ గా సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. సెట్స్ మీదున్న కాటమరాయుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక న్యూ ఇయర్ కానుకగా వచ్చిన పోస్టర్ అయితే విజిల్స్ వేయాలనిపించేలా ఉంది. పోస్టర్ సగం మాత్రమే ఇలా ఉంటే ఇక ఫుల్ పోస్టర్ వస్తే ఫ్యాన్స్ ను ఆపలేమని చెప్పొచ్చు.

కాటమరాయుడు తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ సినిమా చేస్తున్న పవర్ స్టార్ ఆ తర్వాత నీశన్ డైరక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. తమిళ వేదలం రీమేక్ గా ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పోస్టర్ తో క్రేజ్ తెచ్చుకోవడంలో పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా.. మరి సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశ పరచినా కాటమరాయుడుతో పవర్ స్టార్ కచ్చితంగా మరోసారి రికార్డుల పని పడతాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
 
Top