తెలుగు బుల్లితెరపై తన గానామృతంతో అందరి మనసు దోచిన సింగర్ గీతామాధురి.   ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోగా, సైడ్ హీరోగా వస్తున్న నందుని ప్రేమించి పెళ్లిచేసుకుంది.  ఇప్ప‌టికే గీత కేరీర్‌లోనే ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. అంతే కాదు ఎన్నో ప్రైవేట్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే..తన పాటలతో అలరిస్తున్నారు.  ఆమె త‌న సోష‌ల్ మీడియా ద్వారా తన విష‌యాలు, తాను చెప్పాల‌నుకున్న విష‌యాలు వెల్ల‌డిస్తూ త‌న ఫ్యాన్స్‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉంటోంది.
తాజాగా గీతామాధురి సోషల్ మీడియా వీక్షకులకు ఓ పెద్ద ప్రశ్న సంధించింది.  గూగుల్ లో మనం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంటాం..అయితే నాకు ఓ పెద్ద డౌట్ వచ్చింది..కాస్త క్లారిఫై చేస్తారా అంటూ యూట్యూబ్ లో తన డౌట్ పోస్ట్ చేసింది.  మ‌రి ఇంత‌కు గీతకు వ‌చ్చిన డౌట్ ఏంటో చూద్దాం.పిల్లలకు చాలా మంది పెద్దలు ‘దీర్ఘ స్నానం.. శీఘ్ర భోజనం’ అనే సామెత చెబుతుంటారు. అంటే స్నానం నెమ్మదిగా చేయాలి.
భోజనం మాత్రం చాలా వేగంగా చేయాలి అనేది దాని అర్థం. మ‌రికొంద‌రు మాత్రం స్నాన‌మే కాదు..భోజ‌నం కూడా చాలా నెమ్మ‌దిగా చేయాల‌ని అంటుంటారు. నెమ్మ‌దిగా అన్నాన్ని న‌మిలి మింగితే తిన్న‌ది ఒంట‌బ‌ట్టి బ‌లాన్ని ఇస్తుంద‌నేది వారి ఉద్దేశం. మ‌రి ఈ రెండిటిలో ఏది నిజం అన్న‌దే గీత డౌట్‌.  మరి గీతా మాధురి డౌట్ ని క్లియర్ చేసే జవాబు మీ దగ్గర ఉంటే వేంటనే ఆన్సర్ ఇవ్వండి. 

 
Top