సూపర్ స్టార్ మహేష్ తో వన్ నేనొక్కడినేలో కలిసి నటించిన హీరోయిన్ కృతి సనన్ ఇప్పుడు తనలోని మరో యాంగిల్ అందరికి చూపించేస్తుంది. ఇన్నాళ్లు పద్ధతిగా ఉన్న అమ్మడు కొంపదీసి మిగతా వారిలా బోల్డ్ సినిమాలకు సిద్ధమవుతుందా ఏంటని అనుకునేరు అదేం కాదండి.. అమ్మడికి మోడలింగ్ కాకుండా మరో పిచ్చి ఉందట అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఇప్పటికి తన చేత్తో డిజైన్ చేసిన డ్రెస్ లనే తాను వేసుకుంటా అంటుంది కృతి సనన్. ఇన్నాళ్లు పైకి కనిపించే నటన మాత్రమే కాకుండా తనలో ఈ యాంగిల్ తో అందరికి సర్ ప్రైజ్ అందించింది కృతి సనన్.
మహేష్ వన్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రాగానే టాలీవుడ్ లో పాగా వేయాలని చూసిన కృతి సనన్ కు షాక్ తగిలింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా దోచెయ్ సినిమా చేసినా అది హిట్ అవలేదు. అందుకే ఇక్కడ నుండి బాలీవుడ్ చెక్కేసిన కృతి సనన్ అక్కడ తన సోయగాలతో కాస్త పర్వాలేదు అనిపించుకుంటుంది. ఇక కేవలం హీరోయిన్ గానే కాకుండా తనలో ఫ్యాషన్ డిజైనర్ కూడా ఉంది అంటూ రకరకాల కాస్టూమ్స్ తో హల్ చల్ చేస్తుంది.
మొన్నటికి మొన్న కొత్త రెండు వేల రూపాయల డిజైన్ తో డ్రెస్ వేసుకుని కనిపించిన కృతి ఇప్పుడు సరికొత్త మోడల్స్ తో ముందుకు వస్తుంది. హీరోయిన్ గా ఛాన్సులు పట్టేస్తూనే తనకు నచ్చిన డిజైనింగ్ రంగంలో కూడా రాణించాలని చూస్తుంది కృతి. సో మరి అమ్మడి ఈ డిజైనింగ్ కేవలం తన వరకేనా లేదా ఒక సినిమాకు పనికి వచ్చే విధంగా చేస్తుందా అన్నది చూడాలి. తను హీరోయిన్ గా నటించే సినిమాల కాస్టూమ్స్ తను చూసుకునే అవకాశం కల్పించుకునేలా అమ్మడి ప్రయత్నాలు ఉన్నాయి మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.