టాలీవుడ్ క్రేజీ బ్యూటిగా ప్రస్తుతం తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్న రకుల్ ప్రీత్ అతితక్కువ కాలంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయిన హీరోయిన్. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అందరిపక్కనా నటిస్తూ సినిమాకు కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఈ ఢిల్లీ బ్యూటీ తన శాశ్విత చిరునామాగా భాగ్యనగరాన్ని మార్చుకోవడమే కాకుండా ఇక్కడ ఒక విలాసవంతమైన ఇల్లు కొనుక్కున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ముగిసిపోతున్న ఈ 2016లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రకుల్ కొనుక్కున్న తన సొంత ఇంటికి సంబంధించిన వార్తలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. తన సొంత ఇల్లు డిజైనింగ్ విషయంలో రకుల్ చాల జాగ్రత్తలు తీసుకుందట. ముఖ్యంగా ఇంటిలోని చాలా భాగాన్ని మరీ ముఖ్యంగా లివింగ్ రూమ్ ను సినిమాటిక్ థీమ్ తో డిజైన్ చేయించుకుందట.
ఈ బ్యూటీ ఇంట్లోని ఇంటీరియర్స్ ఏ మూలనుంచి చూసినా అన్నిటిలోనూ సినిమాటిక్ టచ్ తోనే ఉంటాయట. బాలీవుడ్ నుంచి టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరి చిత్రాలు క్లాసిక్స్ ఫార్మాట్ లో ఆమె ఇంటిలో కనిపిస్తాయట. ఆశ్చర్యం ఏమిటంటే టాలీవుడ్ సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ నిర్మాతల దగ్గర కోట్లాది రూపాయలు పుచ్చుకుంటున్న రకుల్ ఇంటిలో టాలీవుడ్ సెలెబ్రెటీల ఫోటోలు కాకుండా బాలీవుడ్ టాప్ మోస్ట్ ఫోటోలు ఉండటం ఇక్కడి ట్విస్ట్.
ఇది ఇలా ఉండగా రకుల్ ఈ కొత్త ఇంటిలోకి మారక ముందు మూడేళ్ల పాటు ఒక స్టార్ హోటల్ లో ఒకే రూమ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది అని తెలుస్తోంది. ఆ హోటల్ గది ప్రభావంతో తన సొంతింటిలోని బెడ్ రూమ్ ను కూడ సేమ్ టు సేమ్ డిజైన్ చేయించుకుంది అని టాక్.
దీనితోపాటుగా ఆ ఇంటిలో ఒక బార్ తో పాటు స్విమ్మింగ్ పూల్ లు కూడ టెర్రస్ మీద ఉంటుంది అని తెలుస్తోంది. ఏది ఏమైనా రకుల్ కొత్త ఇంటి వార్తలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి..