బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. హాలీవుడ్ తలదన్నే విధంగా అడల్ట్ కాంటెంట్ సినిమాల్లో లిప్ లాక్, బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్నారు. అయితే ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్లు ఎంతో గంభీరమైన పాత్రల్లో నటిస్తూ వారి గౌరవాన్ని కాపాడుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి..బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్నవారు సైతం ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ..బీ గ్రెడ్ హీరోయిన్లకన్నా ఘోరంగా ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా మగవారిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మగాడు మంచం మీద మాత్రమే ఆడదాని కోరిక తీర్చడానికి ఉపయోగపడతాడని అంతకు మించి ఆడదానికి మగాడి అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ హాట్ భామ ప్రియాంకా చోప్రా.
బాలీవుడ్ నుండి హాలీవుడ్ స్థాయికి వెళ్లిన ఈ భామ అక్కడ రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది . ఇక ఇప్పుడేమో మగాడు సెక్స్ కి తప్ప మాకు ఎందుకు పనికిరాడని మేము కూడా రెండు చేతులా సంపాదిస్తూన్నామని ఘాటుగా విమర్శించింది. ఈ అమ్మడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.