సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురగదాస్ డైరక్షన్లో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఈ సినిమా తర్వాత కెరియర్ లో మరింత స్పీడ్ పెంచాడని తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివతో ఓ సినిమాకు ముహుర్తం పెట్టేసిన మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. వంశీ పైడిపల్లి సినిమా పివిపి నిర్మాణంలో చేయాల్సి ఉన్నా అది ఎందుకో వర్క్ అవుట్ కాదని.. అశ్వనిదత్, దిల్ రాజులను ఆ ప్రాజెక్ట్ కు అటాచ్ చేశాడు మహేష్.
పివిపితో ఆర్ధిక పరమైన విషయాల పట్ల ఓ క్లారిటీ తీసుకున్నా వంశీ మాత్రం పివిపితో ఓ సినిమా కమిట్మెంట్ ఉండటంతో మహేష్ తో సినిమా డైలామాలో పడ్డాడట. అసలైతే పివిపి బ్యానర్లోనే మహేష్ సినిమా డైరెక్ట్ చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అయితే ఇప్పుడు వంశీని తన బ్యానర్లో ఓ సినిమా చేసి కాని మహేష్ సినిమా చేయాలని అంటున్నాడట పివిపి. సో అలా అయితే మహేష్ కొరటాల శివ సినిమా అయ్యేలోగా వంశీ ఖాళీగా ఉండె అవకాశాలు కనిపించట్లేదు.
అందుకే మహేష్ కొరటాల శివ సినిమా తర్వాత త్రివిక్రం సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాతో క్రేజీ కాంబినేషన్ గా మారిన మహేష్ త్రివిక్రం సినిమా అంటే ఇండస్ట్రీలో కూడా సంచలనాలు షురూ అన్నట్టే. ప్రస్తుతం పవర్ స్టార్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం తర్వాత సినిమా మహేష్ తో ఉంటుందని చెప్పకనే చెప్పాడు. సో మహేష్ తో సినిమా అవకాశం వచ్చినా తన కమిట్మెంట్ వల్ల వంశీ ఆ ఛాన్స్ మిస్ చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. మరి మహేష్ త్రివిక్రం సినిమా తర్వాత అయినా వంశీ పైడిపల్లికి అవకాశం ఇస్తాడా లేడా అన్నది చూడాలి.