బన్నీకి సినిమా వ్యాపారం, పబ్లిక్ పల్స్ పై మంచి పట్టుంది. అందుకే తనదైన శైలితో నటించి తన ప్రతి సినిమాను విజయపథం లో నడిపిస్తున్నాడి. నేటి తరం హీరోలలకి బన్నీ కున్ననత విజయాలు శాతం లేదు. నటుడుగా మంచి ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. వరుస విజాయాలే దీనికి ఉదాహరణ. అల్లు అర్జున్ విజాయాల జోరూ కాస్త ఎక్కువే. సరైనోడు తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో "డీజే-దువ్వాడ జగన్నాథం" సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం  బన్నీ, ఆయన కుటుంబం కూతురు పుట్టిన ఆనందంలోనే మునిగి తేలుతున్నారు. 
తాజాగా ఓ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు మంగళవారం వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ తనను కలిసిన కొందరు అభిమానులతో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 గురించి అడిగిన అభిమానులతో, "ఈ సారి సంక్రాంతి మనదే" అని వ్యాఖ్యానించినట్టు టాక్. 
ఆ మాట నందమూరి ఫ్యాన్స్‌కి తెలియడంతో,  బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కన్నా, ఖైదీ నంబర్ 150 నే సూపర్ హిట్ అన్న అర్థంలోనే బన్నీ ఆ వ్యాఖ్యలు చేశాడని వాళ్ళు  అనుకుంటున్నారు. దీంతో బన్నీపై నందమూరి అభిమానులు మరింత పదునైన వ్యాఖ్యలను చేసేటందుకు సిద్ధమవుతున్నారట. కాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్, సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా "ఖబడ్దార్" అన్న పదాన్ని చాలా పదునుగా యెలుగెత్తి అన్నాడు. చిరంజీవి అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకునికి కూడా ఇర్రిటేటింగ్ అనిపించిందా సందరభం. క్రిష్ క్వాలిటి ఇంతేనా? అని విజ్ఞులు కూడా భావించారు. చివరకు దానిపై క్రిష్ వివరణ ఇచ్చినా, బన్నీ ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చిందని నందమూరి అభిమానులు చర్చించు కుంటున్నారట. 
కాగా, స్వతహాగా దురభిమానుల ఆగడాలను, దురభిమానాన్ని అంతగా ఇష్ఠపడని బన్నీ ఇంతకు ముందు కూడా అభిమానులు పవన్ కల్యాణ్‌నుద్దేశించి ప్రశ్నించినప్పుడు కూడా "చెప్పను బ్రదర్" అని బన్నీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యతో బన్నీ, కొంత పవన్ కల్Yఆణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయమూ తెలిసిందే. అయినా బన్నీ దానికేమీ సంజాయిషీ కూడా యివ్వలేదు. మరి తాజా కామెంట్ ఎంత వరకు దారితీస్తుందో చూడాలి. అయినా చిరంజీవి అభిమానిగా తన సినిమా బాగా ఆడుతుందని, కాలం మనకే కలసివస్తుందని చెప్పటం అతని భాధ్యత కూడా. 
 
Top