తెలుగు ఇండస్ట్రీలో గమ్యం, ప్రస్థానం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని రన్ రాజా రన్ చిత్రంతో అనుకోకుండా సూపర్ హిట్ కొట్టాడు. ఈ సంవత్సరం ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంతో మంచి విజయం సాధించిన శర్వానంద్ నటించిన ‘శతమానం భవతి’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి".
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక గా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం నేడు హైదరాబాద్ లో పూర్తి అయ్యింది. కుటుంబ కథా నేపధ్యం లో సాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికెట్ లభించింది.
ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ - దర్శకత్వం - మాటలు - స్క్రీన్ప్లే : సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ - మధు ,సినిమాటోగ్రఫి - సమీర్ రెడ్డి, సంగీతం - మిక్కీ జె మేయర్,నిర్మాతలు : రాజు , శిరీష్