వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బస్తీమే సవాల్ అంటూ.. వంగ వీటి సినిమా వివాదాన్ని చాలెంజ్ చేసిన వర్మ ఈ సారి బాలీవుడ్ ఖాన్ లపై విరుచుకుపడ్డారు. ఇటీవలె ‘దంగల్’ చూసిన వర్మ అందులో నటించిన అమీర్‌ఖాన్‌ను ఆకాశానికెత్తేశాడు. ఇతర ఖాన్‌ల కారణంగా భారతీయులందరినీ ప్రపంచం పిచ్చోళ్లలా చూస్తోందని, అమీర్ కారణంగానే ప్రపంచం అంతా ఇండియాని సీరియస్‌గా తీసుకుంటోందని వ్యాఖ్యానించాడు.
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బస్తీమే సవాల్ అంటూ.. వంగ వీటి సినిమా వివాదాన్ని చాలెంజ్ చేసిన వర్మ ఈ సారి బాలీవుడ్ ఖాన్ లపై విరుచుకుపడ్డారు. ‘దంగల్ చూసిన తర్వాత నాకేమనిపిస్తోందంటే.. మిగిలిన హీరోలందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తమను తామే తన్నుకోమని చెప్పాలనిపిస్తోంద’ని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
బాలీవుడ్ లో ఆలం ఆరా కాలం నుంచి చూస్తున్నా.. ఏ స్టార్ హీరో అయినా తండ్రిగా కనిపించేందుకు బరువు పెరిగి లావుగా కనిపించాలని అనుకున్నాడా? ఇతర ఖాన్స్ అంతా ప్రేక్షకులను వెర్రివాళ్లను చేద్దామని అనుకుంటే.. అమిర్ మాత్రం ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ను నమ్ముతాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఇంతటితో సరిపెట్టలేదు వర్మ... 'దంగల్' చూశాక మొత్తం చిత్ర పరిశ్రమతోపాటు మిగిలిన ఖాన్లు కూడా జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తీరాలని తాను ఫీల్ అవుతున్నట్టు వర్మ ట్వీట్ చేశారు.